You are currently viewing జరధ్గవము – దీర్ఘకర్ణము | Gradda Pilli Katha ( Panchatantra Kathalu )

జరధ్గవము – దీర్ఘకర్ణము | Gradda Pilli Katha ( Panchatantra Kathalu )

Gradda Pilli Katha in Telugu.

భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరధ్గవమనే ముసలి గ్రద్ధ ఉండేది. ఆ గ్రద్ధకు కళ్ళు కనిపించవు అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహరంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు ‘దీర్ఘకర్ణము’ అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి ‘ఎవరక్కడ…?’ అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అది అయ్యింది అనుకొని ‘అయ్యా ! నా పేరు దీర్ఘకర్ణము నేను పిల్లిని’ అని చెప్పింది. వెంటనే జరధ్గవము…’ నీవు పిల్లివా! ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలను తీస్తాను’ అంటూ హెచ్చరించింది.

అయ్యా! కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లిజాతి అయినా నాకూ ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను. పైగా బ్రహ్మచారిని. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని చెప్పుకోవటం విని, మీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అంది. దీర్ఘకర్ణుడి మాటలకి జరధ్గవము సంతోషించింది. ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు అయ్యాయి. ప్రతిరోజూ దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరధ్గవము దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి.

చెట్టుపై నున్న పక్షులు తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసి కట్టుగావచ్చి జరధ్గవమును తమ పిల్లలు మాయం అయపోతున్నాయి అన్న విషయం అడిగాయి. జరధ్గవము తనకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు జరధ్గవము తొర్ర లోపలకు వెళ్ళి చూసాయి. తొర్ర నిండా పక్షుల ఈకలు, బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్గవము తొర్రలో తెలివిగా పడేసినవి.

పక్షులన్నీ జరద్గవమే తమ పిల్లలను చంపి తింటోందని అనుకుని ఆ ముసలి గ్రద్ధను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి చంపాయి. అయ్యా! పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయమాటలు నమ్మి దానిని ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తి జరిగింది నాకు. అనిగ్రద్ధ ప్రాణాలు విడిచింది.

చూసారా! పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్ధకు ఎలాంటి ఆపద వచ్చిందో. అందుకే మనకి తెలియని వాళ్ళు చెప్పీ మాటలను మనం నమ్మరాదు. నమ్మితే జరద్గవములా మనం కూడా చిక్కుల్లో పడతాం.

Gradda Pilli Katha

Gradda Pilli Katha in English. ( Panchatantra Kathalu )

Bhaageeradhee nadi oddana pedda juvvi chettu undi. Aa chettu torralo jaradhgavamane musali graddha undedi. Aa graddhaku kallu kanipinchavu andukani aa chettu meeda unde pakshulu tamaku techchukunna aaharamlo aa graddaku konta pettevi. Aa gradda pakshulu bayataku vellinapudu vaati pillalaku manchi manchi kathalu cheppi nidra puchchedi. Oka roju ‘deerghakarnamu’ ane perugala pilli pakshula pillalni tinataaniki aa chettu paiki cherindi. Aa pillini choosi pakshi pillalu bhayanto arichaayi. Aa arupulu vinna jaradhgavamu torralonchi bayataku vachchi ‘evarakkada…?’ antoo kopamgaa arichindi. Aa arupuku pilli pai praanaalu paine poyaayi. Tappinchukovataaniki daaniki daari kanipinchaledu. Edaite adi ayyindi anukoni ‘ayyaa ! Naa peru deerghakarnamu nenu pillini’ ani cheppindi. Ventane jaradhgavamu…’ neevu pillivaa! Mundu ee chettu digi vellipo lekapote nee praanaalanu teestaanu’ antoo hechcharinchindi.

Ayyaa! Kopaginchukokandi nenu puttindi pillijaati ayinaa naakoo aa jaati buddhulu maatram raaledu. Nenu maamsam tinanu. Paigaa brahmachaarini. Ikkadi pakshulu meeru chaalaa manchivaarani cheppukovatam vini, meeto sneham cheyyaalani vachchaanu andi. Deerghakarnudi maatalaki jaradhgavamu santoshinchindi. Aa roju nundi aa rendu manchi mitrulu ayyaayi. Pratirojoo deerghakarnudu saayantram poota jaradhgavamu daggaraku vachchi O ganta sepu kaburlu cheppi vellipotundevaadu. Konni rojulu gadichipoyaayi.

Chettupai nunna pakshulu tama pillalu maayam avutunnaayanna samgati telusukunnaayi. Avannee okaroju kalisi kattugaavachchi jaradhgavamunu tama pillalu maayam ayapotunnaayi anna vishayam adigaayi. Jaradhgavamu tanaku e paapam teliyadani cheppindi. Pakshulu jaradhgavamu torra lopalaku velli choosaayi. Torra nindaa pakshula eekalu, bomikalu kanipinchaayi. Avannee deerghakarnudu pakshi pillalanu champi tini jaradgavamu torralo telivigaa padesinavi.

Pakshulannee jaradgavame tama pillalanu champi tintondani anukuni aa musali graddhanu soodigaa unde tama mukkulato podichi champaayi. Ayyaa! Pilli maamsaahaari ani telisinaa daani maayamaatalu nammi daanini ee chettupaiki cheranichchinanduku tagina Saasti jarigindi naaku. Anigraddha praanaalu vidichindi.

Choosaaraa! Pilli maatalu namminanduku aa graddhaku elaanti aapada vachchindo. Anduke manaki teliyani vaallu cheppee maatalanu manam nammaraadu. Nammite jaradgavamulaa manam koodaa chikkullo padataam.

Share your Thoughts as Comments on Gradda Pilli Katha.

Leave a Reply