Nakka Mosamu Katha in Telugu.
పూర్వం మగధ రాజ్యంలో మందారవతి అనే వనం ఉండేది. ఆ వనంలో ఒక లేడి, కాకి ఎంతో స్నేహంగా జీవిస్తుండేవి. కొన్నాళ్ళకి ఆ వనంలోకి ఒక నక్క ప్రవేశించింది. అది లేడిని చూసి ”ఈ లేడి ఎంతో కొవ్వు పట్టి ఉంది. దీని మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. ఏదో ఒక ఉపాయం పన్ని దీని మాంసం రుచి చూడ వలసిందే…” అనుకుంది.
నెమ్మదిగా అదను చూసుకుని లేడికి ఎదుట పడింది. నక్కను చూసిన లేడి బెదిరి పరుగందుకోబోయింది. వెంటనే నక్క ”మిత్రమా…! భయపకు. నేను నీకు హాని తలపెట్ట రాలేదు… నీతో స్నేహం చెయ్యాలని వచ్చాను” అంటూ బొంకింది. ఆ మాటలు విన్న లేడి కొంత ధైర్యం తెచ్చుకుని ”ఎవరు నీవు.. ఏమి నీ కథా…” అంటూ ప్రశ్నించింది. అందుకు ఆ నక్క ”నా పేరు సుబుద్ధి.. నా బంధు జనమంతా మరణించారు. నేను ఒంటరివాడినయ్యి ఈ వనంలోకి ప్రవేశించాను. వచ్చీ రావటంతోనే నిన్ను చూసాను. ఎందుకనో నీవు మంచివాడివిలా కనిపించవు.. నీతో స్నేహం చేయాలని బుద్ధి పుట్టింది” అంటూ అప్పటి కప్పుడు ఓ కథంను కల్పించి చెప్పింది.
పేరు వలే ఆ నక్క కూడ సుబుద్ధులు కలిగినదని నమ్మిన ఆ లేడి దానితో స్నేహం చెయ్యటానికి ఒప్పుకొని తనతో పాటు తన నివాసానికి తీసుకువచ్చింది.
నక్కను చూసిన కాకి లేడితో ”మిత్రమా ఎవరితడు?” అని అడిగింది. సుబుద్ధి కథను లేడి కాకికి చెప్పి నేటి నుండి ఇతను మనకి మిత్రుడు అంది. కాకి అందుకు అంగీకరించక ”మిత్రమా! కొత్తవారిని తొందరపడి వెంటనే నమ్మవచ్చునా? ఆ తొందరపాటు వలన ప్రాణములకే ప్రమాదము కలుగును. పూర్వము జవరద్గము అనే గ్రుడ్డి గ్రద్ధ పిల్లి మాటలు నమ్మి ప్రాణములు కోల్పోయిన కథం చెప్తాను విను…”
అంటూ జరధ్గవము – దీర్ఘకర్ణము (గ్రుడ్డి గ్రద్ధ పిల్లి) కథను చెప్పిన కాకి, మిత్రమా … అందుకనే కొత్తవారిని నమ్మితే అపాయము కలుగవచ్చు అంది.
కాకి మాటలకు నక్క ”బావుంది నీ వరస.. ఈ లేడితో నీవే స్నేహం చేయుటకు వచ్చినపుడు నీవూ నావలే క్రొత్తవాడివి కదా.. అటువంటప్పుడు నీతో స్నేహం చెయ్యలేదా… నీవు చెప్పినట్లు అందరూ కొత్తవారిని అనుమానిస్తూ పోతే ఈ లోకంలో ఎవ్వరూ ఎవ్వరితోనూ స్నేహం చెయ్యలేరు” అంటూ ఎగతాళి చేసింది. లేడి కూడ నక్క మాటలకి వంత పాడి ”సరే.. మిత్రమా.. ఈ సుబుద్ధి చెప్పినది నిజమే కదా. అందుకని ఇతడిని స్నేహితుడిగా అంగీకరిద్దాం” అంది. కాకి ఇక చేసేదేం లేక ”సరే” నని నక్క మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలని నిశ్చయించుకుంది. కాకి, నక్క, లేడి మూడూ ఎంతో స్నేహంగా ఉండసాగాయి.
ఒకనాడు నక్క లేడితో ”మిత్రమా.. అడవికి దాపుల ఏపుగా పెరిగిన పైరును చూసాను… అది నీకు తగిన ఆహారం నాతోరా… పంట కోతల వచ్చే వరకు నీకు ఆహార కొరత ఉండదు” అంటూ లేడిని తీసుకుపోయి పొలం చూపించింది. లేడి ఎంతో సంతోషపడిపోయి పొలం మీద పడి ఇష్టం వచ్చినట్లు గెంతుతూ కుడుపారా తిన్నది.
ఆనాటి నుండి ప్రతిరోజు ఆ పంట దగ్గరకు పోయి లేడి కుడుపు నింపుకోసాగింది. కొద్దిరోజులకే ఆ పొలం యజమాని తన పంటను ఏదో జంతువు వచ్చి తిని పోతున్నదని గ్రహించి వలపన్నాడు. అది తెలియక ఎప్పటిలా తినటానికి వెళ్ళిన లేడి అందులో చిక్కుకుపోయింది. పాపం! ఆ లేడి తన దుస్థితికి చింతిస్తూ ‘అయ్యో! ఈ సమయంలో నా మిత్రుడు నక్క వస్తే బాగుండు. ఈ వల కొరికి నన్ను రక్షిస్తుంది’ అనుకుంది. అది అనుకున్నదే తవుగా నక్క అక్కడకు వచ్చి ”అయ్యో!
మిత్రమా… నీవు ఎలా ఈ వలలో చిక్కుకున్నావు” అంటూ సానుభూతి నటించింది.
లేడి విలపిస్తూ ”మిత్రమా! నన్ను రక్షించు. ఈ వల కొరికి నన్ను బంధ విముక్తుడ్ని చేయి” అంటూ ప్రాధేయపింది. నక్క ”సరే” నని పళ్ళతో వలను కొరకబోతూ ”అయ్యో! మిత్రమా ఈ వల నరములతో పేనినది. నేను నేడు ఉపవాసం కనుక దీనిని కొరకలేను” అని చెప్పి లేడి ఖర్మాన లేడిని వదిలేసి ప్రక్కనున్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. ఆ పొలం యజమాని వచ్చి లేడి ప్రాణాలు తీస్తే దాని మాంసం రుచి చూడొచ్చని నక్క ఆశ.
లేడి కోసం చాలా పొద్దు ఎదురుచూసిన కాకి నక్కను వెతుక్కుంటూ బయలు దేరి పొలం దగ్గర వలలో చిక్కుకున్న లేడిని చూసి విషయము తెలుసుకొని ”నక్క ఎక్కడ?” అంటూ అడిగింది. ”ఇక్కడే ఎక్కడో కాచుకుని ఉండి ఉంటుంది.. అది నీవు చెప్పినట్లే నా ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ పొలం యజమాని నన్ను చావబాదితే నా మాంసం తినచ్చని దాని ఎత్తు. మిత్రమా! ఎలాగైనా నన్ను రక్షించు” అంటూ లేడి భోరున ఏడ్చింది.
కాకి దానిని ఊరడించి ధైర్యం చెప్పి ”మిత్రమా! అధైర్యపకు. ఎదుటివారి పట్ల ఎప్పుడూ వివేకముతో ఆలోచించాలి. ఒక పని చెయ్యి. వల పరిచిన వాడు వచ్చేసరికి నీవు చచ్చిపడి ఉన్నట్లు నటించు. నేను నిన్ను పొడుచుకు తింటున్నట్లు నటిస్తాను.. నీవు చచ్చావనుకుని అతడు వల తప్పిస్తాడు. అప్పుడు నేను అరచి నిన్ను హెచ్చరిస్తాను. వెంటనే లేచి పారిపో” అంటూ సలహా ఇచ్చింది.
కాకి సలహాను పాటించి లేడి తప్పించుకుంది. లేడి తనని మోసం చేసిందని కోపం వచ్చిన ఆ పొలం యజమాని తన వెంట తెచ్చిన దుడ్డు కర్రను లేడి మీదకు విసిరాడు. అది గురి తప్పి సూటిగా పోయి పొదల్లో ఉన్న నక్క మొఖం పగలకొట్టటంతో దెబ్బకు తలపగిలి ఆ మోసకారి నక్క చచ్చింది.

Nakka Mosamu Katha in English. ( Panchatantra Kathalu )
Poorvam magadha raajyamlo mandaaravati ane vanam undedi. Aa vanamlo oka ledi, kaaki ento snehamgaa jeevistundevi.
Konnaallaki aa vanamloki oka nakka pravesinchindi. Adi ledini choosi ”ee ledi ento kovvu patti undi. Deeni maamsam ento ruchigaa untundi. Edo oka upaayam panni deeni maamsam ruchi chooda valasinde…” anukundi.
Nemmadigaa adanu choosukuni lediki eduta padindi. Nakkanu choosina ledi bediri parugandukoboyindi. Ventane nakka
”Mitramaa…! Bhayapaku. Nenu neeku haani talapetta raaledu… Neeto sneham cheyyaalani vachchaanu” antoo bomkindi. Aa maatalu vinna ledi konta dhairyam techchukuni ”evaru neevu.. Emi nee kathaa…” antoo prasninchindi. Anduku aa nakka ”naa peru subuddhi.. Naa bandhu janamantaa maraninchaaru. Nenu ontarivaadinayyi ee vanamloki pravesinchaanu. Vachchee raavatantone ninnu choosaanu. Endukano neevu manchivaadivilaa kanipinchavu.. Neeto sneham cheyaalani buddhi puttindi” antoo appati kappudu O kathamnu kalpinchi cheppindi.
Peru vale aa nakka kooda subuddhulu kaliginadani nammina aa ledi daanito sneham cheyyataaniki oppukoni tanato paatu tana nivaasaaniki teesukuvachchindi. Nakkanu choosina kaaki ledito ”mitramaa evaritadu?” ani adigindi. Subuddhi kathanu ledi kaakiki cheppi neti nundi itanu manaki mitrudu andi. Kaaki anduku amgeekarinchaka ”mitramaa! Kottavaarini tondarapadi ventane nammavachchunaa? Aa tondarapaatu valana praanamulake pramaadamu kalugunu. Poorvamu javaradgamu ane gruddi graddha pilli maatalu nammi praanamulu kolpoyina katham cheptaanu vinu…”
Antoo jaradhgavamu – deerghakarnamu (gruddi graddha pilli) kathanu cheppina kaaki mitramaa … andukane kottavaarini nammite apaayamu kalugavachchu andi.
Kaaki maatalaku nakka ”baavundi nee varasa.. Ee ledito neeve sneham cheyutaku vachchinapudu neevoo naavale krottavaadivi kadaa.. Atuvantappudu neeto sneham cheyyaledaa… Neevu cheppinatlu andaroo kottavaarini anumaanistoo pote ee lokamlo evvaroo evvaritonoo sneham cheyyaleru” antoo egataali chesindi. Ledi kooda nakka maatalaki vanta paadi ”sare.. Mitramaa.. Ee subuddhi cheppinadi nijame kadaa. Andukani itadini snehitudigaa amgeekariddaam” andi. Kaaki ika chesedem leka ”sare” nani nakka meeda eppudoo oka kannu vesi unchaalani nischayinchukundi. Kaaki, nakka, ledi moodoo ento snehamgaa undasaagaayi.
Okanaadu nakka ledito ”mitramaa.. Adaviki daapula epugaa perigina pairunu choosaanu… Adi neeku tagina aahaaram naatoraa… Panta kotala vachche varaku neeku aahaara korata undadu” antoo ledini teesukupoyi polam choopinchindi. Ledi ento santoshapadipoyi polam meeda padi ishtam vachchinatlu gentutoo kudupaaraa tinnadi.
Aanaati nundi pratiroju aa panta daggaraku poyi ledi kudupu nimpukosaagindi. Koddirojulake aa polam yajamaani tana pantanu edo jantuvu vachchi tini potunnadani grahinchi valapannaadu. Adi teliyaka eppatilaa tinataaniki vellina ledi andulo chikkukupoyindi. Paapam! Aa ledi tana dusthitiki chintistoo ‘ayyo! Ee samayamlo naa mitrudu nakka vaste baagundu. Ee vala koriki nannu rakshistundi’ anukundi. Adi anukunnade tavugaa nakka akkadaku vachchi ”ayyo! Mitramaa… Neevu elaa ee valalo chikkukunnaavu” antoo saanubhooti natinchindi.
Ledi vilapistoo ”mitramaa! Nannu rakshinchu. Ee vala koriki nannu bandha vimuktudni cheyi” antoo praadheyapindi. Nakka ”sare” nani pallato valanu korakabotoo ”ayyo! Mitramaa ee vala naramulato peninadi. Nenu nedu upavaasam kanuka deenini korakalenu” ani cheppi ledi kharmaana ledini vadilesi prakkanunna podalloki velli daakkundi. Aa polam yajamaani vachchi ledi praanaalu teeste daani maamsam ruchi choodochchani nakka aasa.
Ledi kosam chaalaa poddu eduruchoosina kaaki nakkanu vetukkuntoo bayalu deri polam daggara valalo chikkukunna ledini choosi vishayamu telusukoni ”nakka ekkada?” antoo adigindi. ”Ikkade ekkado kaachukuni undi untundi.. Adi neevu cheppinatle naa praanaalaku muppu techchindi. Ee polam yajamaani nannu chaavabaadite naa maamsam tinachchani Daani ettu. Mitramaa! Elaagainaa nannu rakshinchu” antoo ledi bhoruna edchindi.
Kaaki daanini ooradinchi dhairyam cheppi ”mitramaa! Adhairyapaku. Edutivaari patla eppudoo vivekamuto aalochinchaali. Oka pani cheyyi. Vala parichina vaadu vachchesariki neevu chachchipadi unnatlu natinchu. Nenu ninnu poduchuku tintunnatlu natistaanu.. Neevu chachchaavanukuni atadu vala tappistaadu. Appudu nenu arachi ninnu hechcharistaanu. Ventane lechi Paaripo” antoo salahaa ichchindi.
Kaaki salahaanu paatinchi ledi tappinchukundi. Ledi tanani mosam chesindani kopam vachchina aa polam yajamaani tana venta techchina duddu karranu ledi meedaku visiraadu. Adi guri tappi sootigaa poyi podallo unna nakka mokham pagalakottatanto debbaku talapagili aa mosakaari nakka chachchindi.
Share your Thoughts as Comments on Nakka Mosamu Katha.