Mitralabhamu Eluka Pavuram Katha in Telugu.
పూర్వం గంగానదీ తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు నివశిస్తూ ఉండేవి. ఆ గుంపులో ”లఫుపతనకము” అనే కాకి కూడ నివశిస్తుండేది. ఒకనాడు ఒక బోయవాడు పక్షుల కోసం వలపన్ని చెట్టు చాటునమాటు వేసాడు.
ముందుగా ఆ బోయను లఫుపతనకము (కాకి) చూసి ఇలా అనుకుంది. ‘అయ్యో! పొద్దున్నే ఈ కిరాతకుడి మొహం చూసానే.. ఈ రోజు నాకు ఏమి చేటు కలుగనుందో… త్వరగా ఈ కిరాతకుడి నీడ పనంత దూరంగా పోవాలి’. అలా అనుకున్న లఫుపతనకము (కాకి) అప్పటికప్పుడు ఆ చెట్టును వదిలి దూరంగా ఎగిరిపోయింది. కొంతసేపటికి తిరిగి వచ్చి మరొక చెట్టుపై వాలి బోయవాడిని గమనించసాగింది.
ఆకాశంలో ఎగురుతూ ఒక పావురాళ్ళ గుంపు అటువైపు వచ్చింది. చిత్రగ్రీవుడు అనే పావురం ఆ గుంపుకు పెద్ద… ఆ పావురం బోయవాడు చల్లిన నూకలను పైనుంచే గమనించి మిగతా పావురాళ్ళతో ”మిత్రులారా! ఎవ్వరూ క్రిందకు దిగకండి.. నూకలకు ఆశించి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి” అంటూ హెచ్చరించింది.
ఆ గుంపులో ఒక పావురం ”బావుంది.. మనం బయలుదేరింది ఆహారం కోసమే కదా.. మరి కళ్ళెదురుగా ఆహారం కన్పిస్తుంటే వాటిని తినవద్దనటం నాకు నచ్చలేదు” అంది. ”మిత్రమా… ఈ ప్రాంతం నిర్జన ప్రదేశం. క్రిందనున్న నూకలు ఎలా వచ్చాయి.? బహుశా ఏ బోయవాడో మన వంటి పక్షుల కోసం వాటినక్కడ చల్లి ఉంటాడు” అన్నాడు చిత్రగ్రీవుడు (పావురం). ఒక వృద్ధ పావురం చిత్రగ్రీవునితో.. నీవే అన్నావు కదా ఇది మనుషుల సంచారము లేని ప్రదేశమని. ఇంకెందుకు భయము.. నా మాట విను.. నీ సందేహములను ప్రక్కన ఉంచు.. క్రిందకు పోయి ఆ ఆహారం కుడుపారా ఆరగిద్దాం” అంది. ఆ వృద్ధ పావురం అనగానే మిగిలిన పావురాలు కూడ అదే తమ మనసులో మాటన్నట్లు ఒక్కసారిగా నేలమీదకు వాలాయి.
పాపం! నూకలకు ఆశించి చిత్రగ్రీవుడి మాట వినని ఆ పావురాలు వేటగాడు పరిచిన వలలో చిక్కుకుని తమ మూర్ఖత్వానికి ఎంతో చింతించి అటువంటి చేటు సలహా ఇచ్చినందుకు ఆ వృద్ధ పావురాన్ని నానా మాటలు అన్నాయి. చిత్రగ్రీవుడు (పావురం) మిగిలిన పావురాలని శాంతింప చేసి ”మిత్రులారా! అధైర్యపకండి.. కష్టకాలమందే కలిసి కట్టుగా ఉండలి.. బుద్ధికి పదును పెట్టి ఉపాయమును ఆలోచించాలి.. గండకీ నదీ తీరంలో ఉన్న వనంలో హిరణ్యకుడు అనే ఎలుక నాకు మంచి మిత్రుడు. అతి దగ్గరకు వెళితే ఈ వలను కొరికి వేసి మనల్ని విముక్తుల్ని చేస్తాడు. అందరం కలిసి ఒక్కసారిగా ప్రయత్నిస్తే ఈ వలతో పాటుగా ఇక్కడ్నుంచి మనం ఎగిరిపోవచ్చు” అంటూ నచ్చ చెప్పింది. వలలో చిక్కుకున్న పావురాలను చూసి ఎంతో ఆనందిస్తూ ఆ బోయవాడు దగ్గరకు వచ్చేసరికి పావురాలన్నీ చిత్రగ్రీవుడి సలహాను ఆచరించి అతనికి అందకుండా ఆకాశంలోకి ఎగిరిపోయాయి.
బోయవాడి వలలో పావురాములు చిక్కుకోవటం మొదట నుంచి లఫుపతనకుడు చూస్తూనే ఉన్నాడు. అవి వలతో సహా ఎగరటంతో ఎక్కడకి పోతాయి అన్న ఆసక్తి కొద్ది వాటిననుసరించాడు. నిరాటంకముగా ప్రయాణించి పావురములన్నీ హిరణ్యకుడు ( ఎలుక ) ఉంటున్న చెట్టు బొరియ ముందు వాలాయి. వాటి రెక్కల శబ్దమునకు భయపడి బొరియలోకి దూరిపోయిన హిరణ్యకుడిని చిత్రగ్రీవుడు పిలిచి బయటకు రప్పించాడు. వలలో చిక్కుకున్న పావురాలను చూసి ”ఏం జరిగింది మిత్రమా?” అంటూ హిరణ్యకుడు ( ఎలుక ) అడుగగా నూకలకు ఆశపి వలలో చిక్కిన వైనాన్ని వివరించి ”మిత్రమా! వాడియైున నీ పండ్లతో ఈ వలను కొరికి మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేయి” అంటూ ప్రాధేయపడ్డాడు.
అలాగేనని హిరణ్యకుడు ( ఎలుక ) ముందుగా చిత్రగ్రీవుడి బంధనాలను విడిపించబోగా ”ముందు వారందరివి విడిపించి చివరగా నన్ను విడిపించు” అంటూ చెప్పాడు చిత్రగ్రీవుడు. ”మిత్రమా! తనకి మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము. నా డ్లవాడికి ఈ వలను ఎంత వరకు త్రెంచగలనో చెప్పలేను. అందుకని ముందుగా నీ బంధనాలను విడిపించుట స్నేహ ధర్మం కదా…” అని చెప్పాడు హిరణ్యకుడు ( ఎలుక ). అయినా చిత్రగ్రీవుడు (పావురం) అంగీకరించకపోవటంతో ముందుగా మిగిలిన పావురములన్నింటి బంధనాలను కొరికి చివరకు చిత్రగ్రీవుడి బంధనాలను విడిపించాడు హిరణ్యకుడు ( ఎలుక ). ఈ తంతును లఫుపతనకుడు చూస్తూనే ఉన్నాడు. చిత్రగ్రీవుడు (పావురం) హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుని మిగతా పావురములతో కలిసి తన నివాసమునకు పయనమయ్యాడు.
పావురములు వలలో నుండి బయట పుట చూసి వాటి వెనుకగా ఎగిరి వచ్చి హిరణ్యకుడు ( ఎలుక ) వాటికి విముక్తి కల్గించుట చూసి అతనితో స్నేహం చేయాలని నిశ్చయించుకుని పావురములు వెళ్ళిపోయిన తరువాత హిరణ్యకుడి నివాసం ముందు వాలి అతిని పిలిచింది. హిరణ్యకుడు ( ఎలుక ) బొరియలో నుంచి బయటకు రాకుండనే ”ఎవరు నీవు?” అంటూ ప్రశ్నించాడు. లఫుపతనకము (కాకి) తను చూసిన చిత్రగ్రీవుడి వైనం చెప్పి నా పేరు లఫుపతనకము (కాకి) నీతో మైత్రి చేయాలని ఇలా వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విన్న హిరణ్యకుడు ( ఎలుక ) బొరియలోనే ఉండి ”నీ మాటలు నమ్మవచ్చునా? నేను నీకు ఆహారం….. నీవు నా పాలిటి యమపాశం చావుకు…. బ్రతుకుకూ మధ్యన స్నేహం కుదురుతుందా..? ”నీవంటి వానితో స్నేహం నావంటి వానికి క్షేమం కాదు. అది ప్రాణాలకే ముప్పు తెస్తుంది.
పూర్వం ఒక లేడి నక్క మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. చివరకు ఒక కాకి వల్ల ప్రాణాపాయం తప్పించు కున్నది. అందుకనే పరిచయం లేని వారి మాటలు విశ్వసించరాదు! స్నేహం చేయునపుడు తగిన వారితోనే చేయాలి” అన్నాడు.
”హిరణ్యకా! నీవు చెప్పినది నిజమే.. నాకు ఆ కథను చెప్పు. వినాలని ఉత్సాహంగా ఉంది” అని అడిగింది లఫుపతనకము (కాకి). హిరణ్యకుడు ( ఎలుక ) చెప్పిన కథ ఎంతో ఇంకో కథలో చెప్పుకుందాం !
Mitralabhamu Eluka Pavuram Katha in English. ( Panchatantra Kathalu )
Poorvam gamgaanadee teeramlo oka pedda boorugu chettu undedi. Aa chettu meeda enno rakaala pakshulu nivasistoo undevi. Aa gumpulo ”laphupatanakamu” ane kaaki kooda nivasistundedi. Okanaadu oka boyavaadu pakshula kosam valapanni chettu chaatunamaatu vesaadu.
Mundugaa aa boyanu laphupatanakamu (kaaki) choosi ilaa anukundi. ‘Ayyo! Poddunne ee kiraatakudi moham choosaane.. Ee roju naaku emi chetu kaluganundo… tvaragaa ee kiraatakudi needa pananta dooramgaa povaali’. Alaa anukunna laphupatanakamu (kaaki) appatikappudu aa chettunu vadili dooramgaa egiripoyindi. Kontasepatiki tirigi vachchi maroka chettupai vaali boyavaadini gamaninchasaagindi.
Aakaasamlo egurutoo oka paavuraalla gumpu atuvaipu vachchindi. Chitragreevudu ane paavuram aa gumpuku pedda… aa paavuram boyavaadu challina nookalanu painunche gamaninchi migataa paavuraallato ”mitrulaaraa! Evvaroo krindaku digakandi.. Nookalaku aasinchi praanaala meedaku techchukokandi” antoo hechcharinchindi.
Aa gumpulo oka paavuram ”baavundi.. Manam bayaluderindi aahaaram kosame kadaa.. Mari kalledurugaa aahaaram kanpistunte vaatini tinavaddanatam naaku nachchaledu” andi. ”Mitramaa… ee praantam nirjana pradesam. Krindanunna nookalu elaa vachchaayi.? Bahusaa e boyavaado mana vanti pakshula kosam vaatinakkada challi untaadu” annaadu chitragreevudu (paavuram). Oka vrddha paavuram chitragreevunito.. Neeve annaavu kadaa idi manushula sanchaaramu leni pradesamani. Imkenduku bhayamu.. Naa maata vinu.. Nee sandehamulanu prakkana unchu.. Krindaku poyi aa aahaaram kudupaaraa aaragiddaam” andi. Aa vrddha paavuram anagaane migilina paavuraalu kooda ade tama manasulo maatannatlu okkasaarigaa nelameedaku vaalaayi.
Paapam! Nookalaku aasinchi chitragreevudi maata vinani aa paavuraalu vetagaadu parichina valalo chikkukuni tama moorkhatvaaniki ento chintinchi atuvanti chetu salahaa ichchinanduku aa vrddha paavuraanni naanaa maatalu annaayi. Chitragreevudu (paavuram) migilina paavuraalani saantimpa chesi ”mitrulaaraa! Adhairyapakandi.. Kashtakaalamande kalisi kattugaa undali.. Buddhiki padunu petti upaayamunu aalochinchaali.. Gandakee nadee teeramlo unna vanamlo hiranyakudu ane eluka naaku manchi mitrudu. Ati daggaraku velite ee valanu koriki vesi manalni vimuktulni chestaadu. Andaram kalisi okkasaarigaa prayatniste ee valato paatugaa ikkadnunchi manam egiripovachchu” antoo nachcha cheppindi. Valalo chikkukunna paavuraalanu choosi ento aanandistoo aa boyavaadu daggaraku vachchesariki paavuraalannee chitragreevudi salahaanu aacharinchi ataniki andakundaa aakaasamloki egiripoyaayi.
Boyavaadi valalo paavuraamulu chikkukovatam modata nunchi laphupatanakudu choostoone unnaadu. Avi valato sahaa egaratanto ekkadaki potaayi anna aasakti koddi vaatinanusarinchaadu. Niraatamkamugaa prayaaninchi paavuramulannee hiranyakudu ( eluka ) untunna chettu boriya mundu vaalaayi. Vaati rekkala Sabdamunaku bhayapadi boriyaloki dooripoyina hiranyakudini chitragreevudu pilichi bayataku rappinchaadu. Valalo chikkukunna paavuraalanu choosi ”em jarigindi mitramaa?” antoo hiranyakudu ( eluka ) adugagaa nookalaku aasapi valalo chikkina vainaanni vivarinchi ”mitramaa! Vaadiyaina nee pandlato ee valanu koriki mimmalni bandha vimuktulni cheyi” antoo praadheyapaddaadu.
Alaagenani hiranyakudu ( eluka ) mundugaa chitragreevudi bandhanaalanu vidipinchabogaa ”mundu vaarandarivi vidipinchi chivaragaa nannu vidipinchu” antoo cheppaadu chitragreevudu. ”Mitramaa! Tanaki maalina dharmam modalu chedda beramu. Naa dlavaadiki ee valanu enta varaku trenchagalano cheppalenu. Andukani mundugaa nee bandhanaalanu vidipinchuta sneha dharmam kadaa…” ani cheppaadu hiranyakudu ( eluka ). Ayinaa chitragreevudu (paavuram) amgeekarinchakapovatanto mundugaa migilina paavuramulanninti bandhanaalanu koriki chivaraku chitragreevudi bandhanaalanu vidipinchaadu hiranyakudu ( eluka ). Ee tantunu laphupatanakudu choostoone unnaadu. Chitragreevudu (paavuram) hiranyakudiki krtagnatalu teliyajesukuni migataa paavuramulato kalisi tana nivaasamunaku payanamayyaadu.
Paavuramulu valalo nundi bayata puta choosi vaati venukagaa egiri vachchi hiranyakudu ( eluka ) vaatiki vimukti kalginchuta choosi atanito sneham cheyaalani nischayinchukuni paavuramulu vellipoyina taruvaata hiranyakudi nivaasam mundu vaali atini pilichindi. Hiranyakudu ( eluka ) boriyalo nunchi bayataku raakundane ”evaru neevu?” antoo prasninchaadu. Laphupatanakamu (kaaki) tanu choosina chitragreevudi vainam cheppi naa peru laphupatanakamu (kaaki) neeto maitri cheyaalani ilaa vachchaanu ani cheppindi. Aa maatalu vinna hiranyakudu ( eluka ) boriyalone undi ”nee maatalu nammavachchunaa? Nenu neeku aahaaram….. Neevu naa paaliti yamapaasam chaavuku…. Bratukukoo madhyana sneham kudurutundaa..? ”Neevanti vaanito sneham naavanti vaaniki kshemam kaadu. Adi praanaalake muppu testundi.
Poorvam oka ledi nakka maatalu nammi praanaala meedaku techchukunnadi. Chivaraku oka kaaki valla praanaapaayam tappinchu kunnadi. Andukane parichayam leni vaari maatalu visvasincharaadu! Sneham cheyunapudu tagina vaaritone cheyaali” annaadu.
”Hiranyakaa! Neevu cheppinadi nijame.. Naaku aa kathanu cheppu. Vinaalani utsaahamgaa undi” ani adigindi laphupatanakamu (kaaki). Hiranyakudu ( eluka ) cheppina katha ento imko kathalo cheppukundaam !
Share your Thoughts as Comments on Mitralabhamu Eluka Pavuram Katha.