You are currently viewing లోభం – నక్క కథ |  Lobham – Nakka Katha ( Panchatantra Kathalu )

లోభం – నక్క కథ | Lobham – Nakka Katha ( Panchatantra Kathalu )

Lobham – Nakka Katha in Telugu.

పూర్వం కల్యాణకటకం అనే పట్టణంలో ఒక వేటగాడు ఉండేవాడు. ప్రతిదినం అడవికి పోయి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడమే వాడికి జీవనోపాధి. ఒకనాడు వాడు వేటకు అడవికి పోయాడు. వాడికొక లేడి కంట పడింది. ఒక్క బాణంతో దానిని నేలకూల్చాడు. పాపం! ఆ లేడి బాణం దెబ్బకు గిల,గిలా తన్నుకుని మరణించింది.

”ఆహా.. ఏమి నా భాగ్యం… లేడి మాంసం త్వరగా అమ్ముడు పోతుంది” అని ఆనందపడిపోతూ దాన్ని భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. దారిలో వాడికొక అడవి పంది ఎదురైంది. ఆ పంది కొవ్వుపట్టి బలిసి ఉంది.. ‘ ఆహా.. ‘ ఈ పందిని కొడితే రెండువందల శేర్ల మాంసం దొరికేటట్లుంది. దానిని అమ్ముకుంటే నాలుగైదు రోజులు వేటకు వచ్చే శ్రమ తప్పుతుంది’ అనుకుని భుజం మీదున్న లేడిని క్రిందకు పడవేసి గురి చూసి పంది మీదకు బాణం వేసాడు. ఆ బాణం రివ్వున దూసుకుపోయి ఆ పంది డొక్కల్లో గుచ్చుకుంది. పాపం! ఆ పంది విల, విలలాడుతూ కోపంతో వేటగాడి మీదకు ఒక్కసారిగా లంఫిుంచింది. వేటగాడు పందితో తలపడ్డాడు.పందికి వేటగాడికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ హడావుడికి ఆ ప్రక్కన పొదల్లో విశ్రాంతి తీసుకుంటున్న పాము కంగారు పడి పుట్టలోకి వెళ్ళబోయి దారి తప్పి పంది కాళ్ళ క్రిందపి చనిపోయింది.

యుద్ధంలో పంది వేటగాడ్ని చంపేసి తానూ చచ్చిపోయింది. కొంతసేపటికి దీర్ఘారావమనే ఓ గుంటనక్క ఆ దారిలోనే వచ్చి చచ్చి ఉన్న లేడిని, వేటగాడిని, పామునీ, పందినీ చూసి మహా ఆనందపిపోతూ ” ఆహా.. ఏమి నా భాగ్యం… తాతలు దాచిన ముల్లె దొరికినట్లు ఒక్కసారిగా నాలుగు జీవాలు నాకు భోజ్యానికి దొరికాయి కదా” అని తెగ సంబర పడిపోతూ… ” ఆహా.. ఈ మాంసం మొత్తం నాకు రెండు మాసములకు సరిపోతుంది కదా” అనుకుని ముందుగా ఏది తినాలో నిర్ణయించుకోలేక చివరికి… ఈ పూటకు ఈ విల్లుకు నారీగా కట్టిన నరాన్ని తిని గుపుతాను. తరువాత నింపాదిగా ముందు పంది మాంసాన్ని… తరువాత లేడిమాంసాన్ని ఆ తరువాత ఆ వేటగాడి మాంసాన్ని తినవచ్చు అనుకుని ముందుగా విల్లుకు కట్టిన నారిని కొరికింది. నారి తెగగానే వంచిన విల్లు బద్ధ ఒక్కసారిగా వచ్చి బలంగా దాని రొమ్ములో గ్రుచ్చుకుని దెబ్బకి చచ్చింది.

చూశారుగా.. లోభం ఎంత చేటు తెస్తుందో.. అందువల్ల దొరికిన దానితో తృప్తి చెందాలి కానీ అత్యాశకు పోయి అంతా ఊడ్చుకుని దాచుకోవాలనుకోవటం చేటు చేస్తుంది..

Lobham Nakka Katha

Lobham – Nakka Katha in English. ( Panchatantra Kathalu )

Poorvam kalyaanakatakam ane pattanamlo oka vetagaadu undevaadu. Pratidinam adaviki poyi jantuvulanu vetaadi vaati maamsaanni ammi sommu chesukovadame vaadiki jeevanopaadhi. Okanaadu vaadu vetaku adaviki poyaadu. Vaadikoka ledi kanta padindi. Okka baanamto daanini nelakoolchaadu. Paapam! Aa ledi baanam debbaku gila,gilaa tannukuni maraninchindi.

”Aahaa.. Emi naa bhaagyam… Ledi maamsam tvaragaa ammudu potundi” ani aanandapadipotoo daanni bhujaana vesukuni intidaari pattaadu. Daarilo vaadikoka adavi pandi eduraindi. Aa pandi kovvupatti balisi undi.. ‘ aahaa.. ‘ ee pandini kodite renduvandala Serla maamsam doriketatlundi. Daanini ammukumte naalugaidu rojulu vetaku vachche Srama tapputundi’ anukuni bhujam meedunna ledini krindaku padavesi guri choosi pandi meedaku baanam vesaadu. Aa baanam rivvuna doosukupoyi aa pamdi dokkallo guchchukundi. Paapam! Aa pamdi vila, vilalaadutoo kopamto vetagaadi meedaku okkasaarigaa lamghiunchindi. Vetagaadu pandito talapaddaadu.Pandiki vetagaadiki madhya pedda yuddhame jarigimdi. Ee hadaavudiki aa prakkana podallo visraanti teesukuntunna paamu kangaaru padi puttaloki vellaboyi daari tappi pandi kaalla krindapi chanipoyindi.

Yuddhamlo pamdi vetagaadni champesi taanoo chachchipoyindi. Komtasepatiki deerghaaraavamane O gumtanakka aa daarilone vachchi chachchi unna ledini, vetagaadini, paamunee, pamdinee choosi mahaa aanamdapipotoo ” aahaa.. Emi naa bhaagyam… Taatalu daachina mulle dorikinatlu okkasaarigaa naalugu jeevaalu naaku bhojyaaniki dorikaayi kadaa” ani tega sambara Padipotoo… ” aahaa.. Ee maamsam mottam naaku remdu maasamulaku saripotumdi kadaa” anukuni mumdugaa edi tinaalo nirnayimchukoleka chivariki… Ee pootaku ee villuku naareegaa kattina naraanni tini guputaanu. Taruvaata nimpaadigaa mumdu pamdi maamsaanni… Taruvaata ledimaamsaanni aa taruvaata aa vetagaadi maamsaanni tinavachchu anukuni mumdugaa villuku kattina naarini korikimdi. Naari tegagaane vamchina villu baddha okkasaarigaa vachchi balamgaa daani rommulo gruchchukuni debbaki chachchindi.

Choosaarugaa.. Lobham emta chetu testumdo.. Amduvalla dorikina daanito trpti chemdaali kaanee atyaasaku poyi amtaa oodchukuni daachukovaalanukovatam chetu chestumdi..

Share your Thoughts as Comments on Lobham – Nakka Katha.

Leave a Reply