You are currently viewing పులి – మేకపిల్ల | Puli Meka Pilla Katha

పులి – మేకపిల్ల | Puli Meka Pilla Katha

Puli Meka Pilla Katha in Telugu.

ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకె్ళ్ళాడు. ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది.

పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధంకాగానే “పులిరాజా! ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను మూడు నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలెయ్యాలి” అంది మేకపిల్ల.
మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో “సరే చెప్పు” అంది పులి కుతూహలంగా.
“నువ్వు మిగతా పులులతో ‘ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది. అయినా చంపకుండా వదిలేశానూ అని చెబితే అవి నమ్మవు నిజమేనా?”
“నిజమే!” అని తలూపింది పులి.
“అలాగే నేనూ మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు. నిజమేనా?” అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది.

“ఇక మూడో నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ!” అంది మేకపిల్ల.
అంత చిన్న పిల్ల తనముందు నిలబడి అంత ధైర్యంగా మాట్ల్లాడటం చూసి పులికి ముచ్చటేసింది.
“నిజమే. నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో” అంది.
‘హమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదూ అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల.

Puli Meka Pilla Katha

Puli Meka Pilla Katha in English. (Neethi Kathalu)

Oka maekalamamdalo bujji maekapillokati umdaedi. Vayasulo chinnadainaa telivitaetallo peddavaallaku ae maatram teesipoyaedi kaadu. Okaroju yajamaani maekalanu komda diguvaki maeta kosam tolukelalaaadu. Aa komda paina oka pedda adavi umdi. Maekapilla atoo itoo gemtutoo mamda numdi dooramgaa adavi vaipu vellipoyimdi. Tana tappu telusukuni venukaku tirigi raabotumtae puli edurupadimdi. Pulini choodagaanae maekapilla modata gajagajaa vanikipoyimdi. Elaagolaa gumde chikkabattukuni dhairyamgaa puli mumdu nilabadimdi.

Puli maekapilla meeda dookadaaniki siddhamkaagaanae “puliraajaa! Okka nimisham aagamdi. Meeku naenu moodu nijaalu cheptaanu. Avi nijamani meeru oppukumtae nannu tinakumdaa vadileyyaali” amdi maekapilla.
Maekapilla maatalu aasaktigaa anipimchadamto “sarae cheppu” amdi puli kutoohalamgaa.
“nuvvu migataa pululato ‘ee roju naako maekapilla edurupadimdi. Ayinaa champakumdaa vadilaesaanoo ani chebitae avi nammavu nijamaenaa?”
“nijamae!” ani taloopimdi puli.
“alaagae naenoo maa maekalato nannu oka puli tinakumdaa vadilaesimdi ani chebitae avi koodaa nammavu. Nijamaenaa?” amdi maekapilla. Puli avunani taloopimdi.

“ika moodo nijam. Chaalaasaepati numdi naenu nee mumdu nilabadi unnaanu. Nuvvu nannu champakumdaa nilabadi maatlaadutunnaavu. Nuvvu imtaku mumdae tinnaavu kaabatti neeku aakali laedu nijamae kadoo!” amdi maekapilla.
Amta chinna pilla tanamumdu nilabadi amta dhairyamgaa maatllaadatam choosi puliki muchchataesimdi.
“nijamae. Nuvvu chaalaa telivaina daanivi. Ninnu vadilaestunnaanu po” amdi.
‘Hammayya, imkeppudoo ammani vadili vachchaeyakoodadoo anukumtoo akkadi numdi paaripoyimdi maekapilla.

Share your Thoughts as Comments on Puli Meka Pilla Katha.

Leave a Reply