Vikramarka Bethala Kathalu Memoir in Telugu.
విక్రమార్కుడు ఒకనాడు తన సభలో కొలువుదీరి ఉండగా ఒక సాధువు ఆ సభలోకి ప్రవేశించాడు. కాషాయ ధారణ- నుదిటను విబూది రేఖలు… భుజానికి ఒక జోలె… కాళ్ళకు పాదుకలు… సర్వసంగపరిత్యాగి అయిన ఆ సాధువు మొఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ సాధువు వచ్చి రావటంతోనే విక్రమార్కుడికి నమస్కరించాడు. విక్రమార్కుడు ఆ సాధువును సముచిత రీతిలో గౌరవించి ఆయనకు పళ్ళుఫలాలను ధనకనకాది వస్తువులను సమర్పించాడు. ఆ సాధువు వాటిని స్వీకరించకుండా చిరునవ్వుతో తిరస్కరిస్తూ మమౌనంగా విక్రమార్కుడికి ఒక దానిమ్మ పండును సమర్పించుకుని వెళ్ళిపోయాడు.
విక్రమార్కుడికి ఆ సాధువు ప్రవర్తన వింతగా తోచింది. తపస్సుశక్తి సంపన్నుడైనా ఆ సాధువు తను ఇచ్చినవి స్వీకరించ కుండా మౌనంగా చిరునవ్వు నవ్వి దానిమ్మపండు ఇచ్చి పోవటంలో ఏదో ఆంతర్యం ఉండిఉంటుందని అది ఆయనకై ఆయన చెప్పేవరకు వేచి చూడలను కున్నాడు. ఎందుకైనా మంచిదని ఆ సాధువు ఇచ్చిన దానిమ్మను భద్ర పరచమని సేవకులను ఆదేశించాడు.
అలా కొంతకాలం గిచింది. ప్రతిరోజు సాధువు విక్రమార్కుడిని దర్శించుకుని క్రమంతప్పకుండ దానిమ్మ పండును ఇచ్చి మెతున్నాడు. ఒకనాడు ఓ సేవకుడు తీసుకు వెళుతున్న దానిమ్మపండు చేజారి క్రిందపడి విచ్చుకుని అందులో నుండి దానిమ్మగింజలకు బదులు రత్నాలు నేల మీద జారాయి. ఆ సేవకుడు ఆశ్చర్యభయాలకు లోనయ్యాడు. ఈ వింత ఆ సేవకుడు విక్రమార్కుడికి వివరించాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయి మిగిలిన పండ్లు అన్నింటిని ఒలిపించగా వాటన్నిటిలోనూ రత్నాలే ఉన్నాయి. మర్నాడు సాధువు యథా ప్రకారం విక్రమార్కుడిని దర్శించుకుని పండును అందివ్వబోయాడు. అప్పుడు విక్రమార్కుడు. ”మహాత్మా…క్షమించండి. మీరు తపశ్శక్తి సంపన్నులు మీరు నా నుండి ఏదో ఆశిస్తున్నారని తొలినాడు నేను సమర్పించిన కానుకలను మీరు తిరస్కరించిననాడే అనుకున్నాను.
”మహాత్మా… నేను రాజును ఇవ్వడమే గానీ తీసుకోవడం మా జాతి లక్షణం కాదు. అయినా ఇంతకాలం మీరిచ్చిన ఫలాలను మీరు చిన్నబుచ్చుకోకూడదనే పుచ్చుకున్నాను. మీరిచ్చినవి సాధారణమైన దానిమ్మలు కాదు. వాటిలో గింజలు బదులు రత్నాలు ఉన్నాయి. అంత మహత్తరమైన ఫలాలను మీ నుండి పుచ్చుకోవటం నాకు చిన్నతనమే కాదు ఉచితంగా ఇతరుల నుండి ఏదీ ముట్టరాదన్న నా నియమానికి విరుద్ధం…
మరోసారి క్షమించండి. మీరు నా నుండి ఆశిస్తున్నది ఏమిటి? నాకు సెలవియ్యండి. ఆఖరికి అది నా ప్రాణాలయినా ఎంతో ఆనందంగా మీకు సమర్పించుకుంటాను” అంటూ విక్రమార్కుడు ఆ సాదువును అడిగాడు. ఆ సాధువు చిరునవ్వుతో…. ”రాజా! నీ సందేహం నిజమయినదే… నేను నీ నుండి సాయం కోరే నీకు ఆ రత్నాల దానిమ్మలను సమర్పించాను. కానీ అందులో నా స్వార్ధంలేదు. రాజా! నేను లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం తలపెట్టాను. దానికి నీ సాయంకావాలి. రాజుకు ఏదీ సమర్పించుకోకుండ సాయం కోరరాదు. అందుకే నీకు ఆ ఫలాలు సమర్పించాను. నీ కిష్టమైతే ఇక ప్రశ్నలతో కాలం వ్యర్ధం చెయ్యకుండ తక్షణం నా వెంటరా…” అన్నాడు.
”అలాగే… మహాత్మా” అంటూ విక్రమార్కుడు రాజ్యభారం భట్టికి అప్పగించి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాడు. విక్రమార్కుడిని సరాసరి అడవి మధ్యలో ఉన్న దేవీ ఆలయంకు తీసుకువెళ్ళి…. ”రాజా… ఇక్కడికి ఉత్తరంగా ఉన్న మర్రిచెట్టు కొమ్మకు ఒక శవం వ్రేళ్ళాడుతూ ఉంటుంది. అది బేతాళుడి శవం దాన్ని తీసుకొచ్చి నీవు నాకు అప్పగించాలి. ఆ బేతాళుడు మహా జిత్తులమారి. నీవు అతనిని భుజానికి ఎత్తుకున్న క్షణం నుండి ఇక్కడకు వచ్చే వరకు మౌనవ్రతం పాటించాలి. నీకు మౌన భంగం కలిగితే బేతాళుడు తిరిగిచెట్టును ఆశ్రయిస్తాడు. మూడవ ఝాము గిడిచే వేళకు నా పూజ పూర్తవుతుంది. ఆ సమయానికి నీవు ఆ బేతాళుడితో ఇక్కడకు చేరుకోవాలి” అంటూ విక్రమార్కుడికి చెప్పాడు.
విక్రమార్కుడు దేవికి నమస్కరించి బేతాళుడి శవమున్న చెట్టు వైపు వెళ్ళాడు. కొంతసేపటికి చెట్టును చేరిన విక్రమార్కుడు బేతాళుడిని భుజాని కెత్తుకుని ముందుకు సాగగా, అతడికి మౌన భంగం కల్గించటానికి బేతాళుడు ”రాజా… ప్రయాణంలో అలసటలేకుండా నీకొక కథను చెబుతాను విను. కథ పూర్తి అయినాక నిన్నొక ప్రశ్నను అడుగుతాను. ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకుండ నీ మౌన వ్రతాన్ని కొనసాగించావా… నీ తల వెయ్యి వక్కలవుతుంది” అంటూ శాపం ఇచ్చి కథను ప్రారంభించాడు.
Vikramarka Bethala Kathalu Memoir in English.
Vikramaarkudu okanaadu tana sabhalo koluvudeeri undagaa oka saadhuvu aa sabhaloki pravesimchaadu. Kaashaaya dhaarana- nuditanu viboodi rekhalu… bhujaaniki oka jole… kaallaku paadukalu… sarvasamgaparityaagi ayina aa saadhuvu mokham ento prasaantamgaa undi. Aa saadhuvu vachchi raavatantone vikramaarkudiki namaskarimchaadu. Vikramaarkudu aa saadhuvunu samuchita reetilo gauravimchi aayanaku palluphalaalanu dhanakanakaadi vastuvulanu samarpimchaadu. Aa saadhuvu vaatini sveekarimchakundaa chirunavvuto tiraskaristoo mamaunamgaa vikramaarkudiki oka daanimma pandunu samarpimchukuni vellipoyaadu.
Vikramaarkudiki aa saadhuvu pravartana vintagaa tochindi. Tapassusakti sampannudainaa aa saadhuvu tanu ichchinavi sveekarimcha kundaa maunamgaa chirunavvu navvi daanimmapandu ichchi povatamlo edo aantaryam undiuntundani adi aayanakai aayana cheppevaraku vechi choodalanu kunnaadu. Endukainaa mamchidani aa saadhuvu ichchina daanimmanu bhadra parachamani sevakulanu aadesimchaadu.
Alaa kontakaalam gichindi. Pratiroju saadhuvu vikramaarkudini darsimchukuni kramantappakunda daanimma pandunu ichchi metunnaadu. Okanaadu O sevakudu teesuku velutunna daanimmapandu chejaari krindapadi vichchukuni andulo nundi daanimmagimjalaku badulu ratnaalu nela meeda jaaraayi. Aa sevakudu aascharyabhayaalaku lonayyaadu. Ee vinta aa sevakudu vikramaarkudiki vivarimchaadu. Vikramaarkudu aascharyapoyi migilina pandlu annintini olipimchagaa vaatannitilonoo ratnaale unnaayi. Marnaadu saadhuvu yathaa prakaaram vikramaarkudini darsimchukuni pandunu andivvaboyaadu. Appudu vikramaarkudu. ”Mahaatmaa…kshamimchandi. Meeru tapassakti sampannulu meeru naa nundi edo aasistunnaarani tolinaadu nenu samarpimchina kaanukalanu meeru tiraskarimchinanaade anukunnaanu.
”Mahaatmaa… nenu raajunu ivvadame gaanee teesukovadam maa jaati lakshanam kaadu. Ayinaa intakaalam meerichchina phalaalanu meeru chinnabuchchukokoodadane puchchukunnaanu. Meerichchinavi saadhaaranamaina daanimmalu kaadu. Vaatilo gimjalu badulu ratnaalu unnaayi. Anta mahattaramaina phalaalanu mee nundi puchchukovatam naaku chinnataname kaadu uchitamgaa itarula nundi edee muttaraadanna naa niyamaaniki viruddham…
Marosaari kshamimchandi. Meeru naa nundi aasistunnadi emiti? Naaku selaviyyandi. Aakhariki adi naa praanaalayinaa ento aanandamgaa meeku samarpimchukuntaanu” antoo vikramaarkudu aa saaduvunu adigaadu. Aa saadhuvu chirunavvuto…. ”Raajaa! Nee sandeham nijamayinade… nenu nee nundi saayam kore neeku aa ratnaala daanimmalanu samarpimchaanu. Kaanee andulo naa svaardhamledu. Raajaa! Nenu loka kalyaanam kosam oka yaj~nam talapettaanu. Daaniki nee saayamkaavaali. Raajuku edee samarpimchukokunda saayam koraraadu. Anduke neeku aa phalaalu samarpimchaanu. Nee kishtamaite ika prasnalato kaalam vyardham cheyyakunda takshanam naa ventaraa…” annaadu.
”Alaage… mahaatmaa” antoo vikramaarkudu raajyabhaaram bhattiki appagimchi appatikappudu bayaluderi vellaadu. Vikramaarkudini saraasari adavi madhyalo unna devee aalayamku teesukuvelli…. ”Raajaa… ikkadiki uttaramgaa unna marrichettu kommaku oka savam vrellaadutoo untundi. Adi betaaludi savam daanni teesukochchi neevu naaku appagimchaali. Aa betaaludu mahaa jittulamaari. Neevu atanini bhujaaniki ettukunna kshanam nundi ikkadaku vachche varaku maunavratam paatimchaali. Neeku mauna bhamgam kaligite betaaludu tirigichettunu aasrayistaadu. Moodava jhaamu gidiche velaku naa pooja poortavutundi. Aa samayaaniki neevu aa betaaludito ikkadaku cherukovaali” antoo vikramaarkudiki cheppaadu.
Vikramaarkudu deviki namaskarimchi betaaludi Savamunna chettu vaipu vellaadu. Kontasepatiki chettunu cherina vikramaarkudu betaaludini bhujaani kettukuni munduku saagagaa, atadiki mauna bhamgam kalgimchataaniki betaaludu ”raajaa… prayaanamlo alasatalekundaa neekoka kathanu chebutaanu vinu. Katha poorti ayinaaka ninnoka prasnanu adugutaanu. Aa prasnaku samaadhaanam telisi cheppakunda nee mauna vrataanni konasaagimchaavaa… nee tala veyyi vakkalavutundi” antoo saapam ichchi kathanu praarambhimchaadu.
Share your Thoughts as Comments on Vikramarka Bethala Kathalu Memoir.