You are currently viewing మహా పండితుడు మాతృభాష | The Telugu Scholar and the Pandit Story [ Tenali Ramakrishna ]

మహా పండితుడు మాతృభాష | The Telugu Scholar and the Pandit Story [ Tenali Ramakrishna ]

The Telugu Scholar and the Pandit Story in Telugu.

ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.

మొదట ‘ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు ‘అమ్మా’ అన్నాడు. అంతే! ” నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!” అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.

“మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే.” అని బదులిచ్చాడు రామకృష్ణుడు.

The Telugu Scholar and the Pandit

The Telugu Scholar and the Pandit Story in English.

Okasaari sreekrshnadevaraayalu daggaraku oka mahaa panditudu vachchaadu. Atadu aneka bhaashallo anargalangaa maatlaadutunnaadu. Intakee samasya emitante raayala sabhaloni kavi panditullo evarainaa atani maatrbhaashanu kanipettaali. Raayalavaaru tana kavidiggajaalanu ee samasya vidagottamani koraadu.

Modata ‘aandhrakavitaapitaamahudani peru pondina peddana kavi lechi, tanaku vachchina bhaashalalo atanito sanbhaashinchi, vaadinchi koodaa, atani bhaasha telchukoleka poyaadu. Taruvaata aaruguroo ante. Chivariki tenaali raamakrshnuni vantu vachchindi. Dhaaraalangaa bhaashalannee valle vestunna aa pandituni daggaraku vellaadu. Ento sepu ataniki edurugaa nilabadi emee adagaleka poyaadu. Otami tappadani raayalu bhaavinchaadu. Aa uddhanda panditudu koodaa uppongipotunnaadu. Intalo akasmaattugaa tenaali kavi aa pandituni kaalunu gattigaa tokkaadu. Aa baadha bharinchaleka panditudu ‘ammaa’ annaadu. Ante! ” nee maatrbhaasha telugu panditottamaa!” ani telchesaadu tenaali raamakrshnudu. Panditudu oppukoka tappaledu. Raayala aanandaaniki antuledu. Sabhaash^! Vikatakavee ani raamakrshnuni mechchukoni bahumaanangaa suvarnahaaran ichchaadu.

“maatrbhaasha goppatanan ade. Aanandanlo kaani vishaadamlo kaani mana noti nundi veluvadedi mana maatrbhaashe.” Ani badulichchaadu raamakrshnudu.

Read More Tenali Ramakrishna Stories .

Leave a Reply