You are currently viewing పిశాచాలు చేసిన సహాయము | Telugu Moral Stories – Pishachalu Chesina Sahayam

పిశాచాలు చేసిన సహాయము | Telugu Moral Stories – Pishachalu Chesina Sahayam

Telugu Moral Stories in Telugu.

అనగనగా ఒక ముసలి అవ్వ, మనుమడు ఉండేవారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విని హడావుడిగా వచ్చి మీ మనుమడు చెట్టు మీదనుంచి పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. డబ్బు తీసుకొని రమ్మన్నాడని చెపితే తీసుకొని వాళ్లమాటలు నిజమేనని నమ్మి ఆ డబ్బులు ఇచ్చింది అవ్వ. ఆధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చతికిలపడింది.

కొంతసేపు గడిచేసరికి మనుమడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా? అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటలు వల్ల అంతా తెలిసి నా కష్టార్జితము మట్టి పాలు చేశావు గదే! ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారము చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే. మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నము తినకుండా వెళ్ళిపోయాడు. మనుమడి మాటలకు అవ్వకు పట్టరాని దుఃఖము కలిగి అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింతచెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. రెండు తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి నా మనుమడిచే అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి నన్ను చంపేయండి అంది.

పిశాచాలు కూడబలుక్కొని అది కుర్రదొంగలపని అని గ్రహించి అవ్వా నీ మనుమడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళతావా? లేక చచ్చిపోతావా? అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే మా వెంటరా అని కుర్రదొంగల వద్దకు తీసుకువెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమయిన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడిపించటం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి “నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని”. మీ సంగతి చెప్తా అంటూ ఇద్దర్నీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యము పిశాచము ఆవహించి వున్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వను మోసం చేసి ధనము తీసుకున్నది మీరేనా అని అనగా మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వా! నీ డబ్బు తీసుకో. అని ఈ అమ్మాయి మంచిది. సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది. నీ మనుమడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి.

అవ్వ ధనముతో పాటు అందగత్తెలాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనుమడు అవ్వా ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య నీ ధనము ఇదుగోరా అంటూ జరిగిన విషయము చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవనంసాగిస్తున్నారు.

Telugu Moral Stories

Telugu Moral Stories in English.

Anaganagaa oka musali avva, manumadu umdaevaaru. Avva amaayakuraalu. Irugu porugu avvaki maayamaatalu cheppi uppu, pappu teesukuvellaevaaru. Avvanu sukhapedadaamamtae avvachaesae paniki manumadiki kopam vachchaedi. Pai pechchu guttugaa samsaaramu chaeyaalani teliyadu anaedi. Oka rojuna avva illu oodustoo umtae chinna taalamu chevi dorikimdi. Adi tana manumadi pettedani teesi pette taalamu teesi pettelopala Dabbu choosi amdarini pilichi cheppimdi. Aa maatalu chaatugaa unna domgalu vini hadaavudigaa vachchi mee manumadu chettu meedanumchi padipoyaadu. Debbalu tagilaayi. Dabbu teesukoni rammannaadani chepitae teesukoni vaallamaatalu nijamaenani nammi aa Dabbulu ichchimdi avva. Aadhanamu teesukoni vaallu paaripoyaaru. Avva aedustoo gummamlo chatikilapadimdi.

Komtasaepu gadichaesariki manumadu sarukulu teesukoni vachchaadu. Appudae debbalu taggipoyaayaa? Ani avva adigaesariki avva cheppina maatalu valla amtaa telisi naa kashtaarjitamu matti paalu chaesaavu gadae! Imkaa kaasta koodabetti pattanamlo vyaapaaramu chaeddaamanukunnaanu. Naaku aa raata laedae. Mallee naa kamtiki kanipimchaku, vellipo ani annamu tinakumdaa vellipoyaadu. Manumadi maatalaku avvaku pattaraani duhkhamu kaligi adaviloki velli pisaachaala baarina padi maranimchaalani bayaludaeri velli chimtachettu daggara koorchoni pisaachaalu pisaachaalu ramdi amtoo arichimdi. Remdu tellani pisaachaalu vachchi mammalni emduku pilichaavu amtoo adigaayi. Avva vaatini choosi bhayapadaka vishayamamtaa cheppi naa manumadichae amta maatalu anipimchukunnaaka emduku bratakaali nannu champaeyamdi amdi.

Pisaachaalu koodabalukkoni adi kurradomgalapani ani grahimchi avvaa nee manumadi dhanamu nee chaetiki tirigi vastae imtiki velataavaa? Laeka chachchipotaavaa? Ani adigaayi. Dhanamu dorikitae imtiki veltaanamtae sarae maa vemtaraa ani kurradomgala vaddaku teesukuvelli bayata umdamani cheppaayi. Lopala amdamayina ammaayini vaalliddaroo aedipimchatam gamanimchi aa ammaayilo pravaesimchi “naenu pisaachaala peddamma pempudu kooturni”. Mee samgati cheptaa amtoo iddarnee chaavabaadimdi. Daamto vaalliddaroo paaripovadaaniki prayatnimchagaa remdo dayyamu pisaachamu aavahimchi vunna dayyam kaalla daggara padaesimdi. Daamto hadalettina domgalato avvanu mosam chaesi dhanamu teesukunnadi meeraenaa ani anagaa maemae amtoo aa dhanamunu akkada padaesi paaripoyaaru. Vaallu vellagaanae avva lopaliki vachchimdi. Avvaa! Nee Dabbu teesuko. Ani ee ammaayi mamchidi. Savati talli baadhalu padalaeka vachchi veeri baarina padimdi. Nee manumadiki ichchi vivaaham chaesi sukhamgaa umdu ani cheppi adrsyamayyaayi.

Avva dhanamuto paatu amdagattelaamti ammaayini teesukuraavadam choosina manumadu avvaa evaru eeme annaadu. Nee bhaarya nee dhanamu idugoraa amtoo jarigina vishayamu cheppimdi. Mamchi muhoortam choosi vaari vivaaham jaripimchimdi. Vaaru sukhamgaa jeevanamsaagistunnaaru.

Share your Thoughts as Comments on Telugu Moral Stories.

Leave a Reply