Rakshasudu Sanyasi Yuvakudu Katha in Telugu.
బేతాళుడి శవాన్ని భుజానికెత్తుకుని అలుపెరగని యోధుడిలా నడక సాగించాడు విక్రమార్కుడు.
రాజా! నీవంటివాడు లోకములో లేడు. నీకునీవే సాటి. నీకు ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండటానికి చక్కని కథ చెప్తాను విను.అంటూ విక్రమార్కుడికి మౌన భంగం కల్గించటానికి కథను ప్రారంభించాడు బేతాళుడు.
పూర్వం ఒక గంధర్వడు శాపవశాత్తు బ్రహ్మరాక్షుసుడి రూపం ధరించాడు. వాడు అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టును నివాసంగా చేసుకుని ఉంటూ ఆ అడవి దాపులనున్న గ్రామాలపై పడి దొరికిన వారిని దొరికినట్లు విరుచుకు తినసాగాడు. రాక్షసుడి ఆగడాలను భరించలేని ఆ ఊరి వాళ్ళు వాడితో యుద్ధం చేసి నెగ్గలేమని సరాసరి రాక్షసుడు ఉండే చోటుకు పోయి ”అయ్యా! ఇలా మీరు రోజు ఎంతో శ్రమపడి గ్రామల మీదకు ఆహారంకోసం రావద్దు. ప్రతిరోజు మీకు మేము ఒక మనిషిని ఆహారంగా పంపుతాము. వాడిని తిని సరిపెట్టుకోండి” అంటూ బ్రతిమాలుకున్నారు. రాక్షసుడు సరేనని ఒప్పుకున్నాడు.
అది మొదలు రోజు కొక గ్రామంవారు ఆ రాక్షసుడికి ఆహారంగా ఒక మనిషిని పంపసాగారు. కాళ్ళదగ్గరకే ఆహారం వస్తుండటంతో రాక్షసుడు ఆ మర్రిచెట్టును వదలకుండా ఒక మనిషితోనే సరిపెట్టుకోసాగాడు. ఒక గ్రామానికి ఒకనాడు ఒక సాధువు వచ్చాడు. ఆ గ్రామస్థులకు ఆయన ఎంతగానో హితోపదేశము… పరోపకారబుద్ధి కలిగినవాడు. నరులలోనే నారాయణుడిని దర్శించగలడని చెప్పాడు.
ఆ రాత్రి సాధువు ఆ గ్రామంలోనే విశ్రాంతి తీసుకున్నాడు. మర్నాడు సాధువు ఆ గ్రామం వదిలిపోతుండగా అడవి దారిలో ఒక తండ్రి కొడుకుతో ”నాయనా… అప్పుడే నీకు నూరేళ్ళు నిండి పోయాయా? ఇందుకా నిన్ను కన్నది” అంటూ భోరున విలపించటం ఆ సాధువుకంటపడి దగ్గరకుపోయి ఏం జరిగిందంటూ అడిగాడు. అప్పుడ వృద్ధుడు రాక్షసుడి ఒప్పందం గురించి చెప్పాడు. ఆ సాధువు అంతా విని మీరేం దిగులు చెందకండి. మీ కుమారుడికి బదులుగా రాక్షసుడికి నేను ఆహారం అవుతాను. అంటూ వారికి నచ్చచెప్పి పంపించి తాను కాషాయి వస్త్రాలను వదిలేసి వేరే దుస్తులను ధరించి రాక్షసుడి కోసం ఎదురు చూడసాగాడు.
కొంత సేపటికి రాక్షసుడు వచ్చి ఆవురావురామంటూ సాధువును చంపి తినటానికి ఉపక్రమించాడు. తండ్రి కొడుకులు అప్పటికి కొంత దూరం వెళ్ళాక కొడుకు తండ్రితో ”నాన్నా… నా కోసం ఆ సాధువు రాక్షసుడికి బలికావటం నాకు నచ్చలేదు. లోకంలో ధర్మ ప్రచారం సాగించే అటువంటి మహాత్ములు మరణం పాలయితే ధర్మమే నశిస్తుంది. అందుకని నీవు వెళ్ళిపో… నేను తిరిగి వెళ్ళి ఆ సాధువును పంపి రాక్షసుడికి నేనే ఆహారం అవుతాను అని చెప్పి తండ్రిని ఊరిలోకి పంపి తిరిగి రాక్షసుడుండే చోటుకు వచ్చాడు.
అప్పటికే రాక్షసుడు సాధువును తినటం మొదలు పెట్టటం చూసిన ఆ యువకుడు ”రాక్షసుడా… ఆయన్ని తినకు. నీకు ఆహారం కావలసింది నేను నన్ను వదిలేసి ఆయన్ను తినటం నీకు ధర్మంకాదు. ఆయన లోకంలో ధర్మమును ఉద్ధరించటానికి నడుం బిగించిన ఉత్తముడు…” అంటూ అరుస్తూ దగ్గరకు వచ్చాడు. రాక్షసుడు తుళ్ళి పడి సాధవును వదిలేసి ”మహాత్మా… తమవంటి వారిని తినటం అపచారం నన్ను క్షమించండి. ఇందుకు ప్రాయశ్చిత్తంగా నేటి నుండి నేను నరమాంస భక్షణ వదిలేస్తున్నాను” అంటూ ఎటో వెళ్ళిపోయాడు.
”రాజా! విన్నావుగా ఈ కథ ఇందులో పరోపకారంతో ప్రాణాలను పణంగా పెట్టి ఆ యువకుడిని కాపాడిన ఆ సాధువు గొప్పవాడ… తన ప్రాణాలు రాక్షసుడికిచ్చి సాధువును కాపాడలనుకున్న ఆ యువకుడు గొప్పవాడ…? ఎవరు ఉత్తములు” అంటూ విక్రమార్కుడిని ప్రశ్నించాడు బేతాళుడు.
”సర్వము త్యాగము చేసినవాడే సన్యాసి అవుతాడు. అతడికి దేహముపై, ప్రాణముపై మమకారములుండవు. ఆ రెండు ఇతరులకు ఉపయోగపడేట్లు వినియోగించటం గొప్ప విషయంకాదు. వయసు ఉండి ఐహిక సుఖాల మీద మమకారంచావని ఆ యువకుడు సాధువును రక్షించటానికి ఆత్మార్పణకు సిద్ధపడ్డాడు. అదృష్టం కొద్ది ప్రాణాలు దక్కించుకునే అవకాశం దక్కినా తిరిగి ప్రాణాలు పోగొట్టుకోవటానికే సిద్ధ పడిన ఆ యువకుడే గొప్పవాడు” అంటూ సమాధానమివ్వటంతో విక్రమార్కుడికి మౌనభంగమై బేతాళుడు మాయమైపోయి తిరిగి చెట్టును ఆశ్రయించాడు.
Rakshasudu Sanyasi Yuvakudu Katha in English. ( Vikramarka Bethala Kathalu )
Betaaludi Savaanni bhujaanikettukuni aluperagani yodhudilaa nadaka saaginchaadu vikramaarkudu.
Raajaa! Neevantivaadu lokamulo ledu. Neekuneeve saati. Neeku prayaanamlo Srama teliyakundaa undataaniki chakkani katha cheptaanu vinu.antoo vikramaarkudiki mauna bhangam kalginchataaniki kathanu praarambhinchaadu betaaludu.
Poorvam oka gandharvadu saapavasaattu brahmaraakshusudi roopam dharinchaadu. Vaadu adavilo oka pedda marrichettunu nivaasangaa chesukuni untoo aa adavi daapulanunna graamaalapai padi dorikina vaarini dorikinatlu viruchuku tinasaagaadu. Raakshasudi aagadaalanu bharinchaleni aa oori vaallu vaadito yuddham chesi neggalemani saraasari raakshasudu unde chotuku poyi ”ayyaa! Ilaa meeru roju ento sramapadi graamala meedaku aahaaramkosam raavaddu. Pratiroju meeku memu oka manishini aahaarangaa pamputaamu. Vaadini tini saripettukondi” antoo bratimaalukunnaaru. Raakshasudu sarenani oppukunnaadu.
Adi modalu roju koka graamamvaaru aa raakshasudiki aahaarangaa oka manishini pampasaagaaru. Kaalladaggarake aahaaram vastundatanto raakshasudu aa marrichettunu vadalakundaa oka manishitone saripettukosaagaadu. Oka graamaaniki okanaadu oka saadhuvu vachchaadu. Aa graamasthulaku aayana entagaano hitopadesamu… Paropakaarabuddhi kaliginavaadu. Narulalone naaraayanudini darsinchagaladani cheppaadu.
Aa raatri saadhuvu aa graamamlone visraanti teesukunnaadu. Marnaadu saadhuvu aa graamam vadilipotundagaa adavi daarilo oka tandri kodukuto ”naayanaa… Appude neeku noorellu nindi poyaayaa? Indukaa ninnu kannadi” antoo bhoruna vilapinchatam aa saadhuvukantapadi daggarakupoyi em jarigindantoo adigaadu. Appuda vrddhudu raakshasudi oppandam gurinchi cheppaadu. Aa saadhuvu antaa vini meerem digulu chendakandi. Mee kumaarudiki badulugaa raakshasudiki nenu aahaaram avutaanu. Antoo vaariki nachchacheppi pampinchi taanu kaashaayi vastraalanu vadilesi vere dustulanu dharinchi raakshasudi kosam eduru choodasaagaadu.
Konta sepatiki raakshasudu vachchi aavuraavuraamantoo saadhuvunu champi tinataaniki upakraminchaadu. Tandri kodukulu appatiki konta dooram vellaaka koduku tandrito ”naannaa… Naa kosam aa saadhuvu raakshasudiki balikaavatam naaku nachchaledu. Lokamlo dharma prachaaram saaginche atuvanti mahaatmulu maranam paalayite dharmame nasistundi. Andukani neevu vellipo… Nenu tirigi velli aa saadhuvunu pampi raakshasudiki nene aahaaram avutaanu ani cheppi tandrini ooriloki pampi tirigi raakshasudunde chotuku vachchaadu.
Appatike raakshasudu saadhuvunu tinatam modalu pettatam choosina aa yuvakudu ”raakshasudaa… Aayanni tinaku. Neeku aahaaram kaavalasindi nenu nannu vadilesi aayannu tinatam neeku dharmamkaadu. Aayana lokamlo dharmamunu uddharinchataaniki nadum biginchina uttamudu…” antoo arustoo daggaraku vachchaadu. Raakshasudu tulli padi saadhavunu vadilesi ”mahaatmaa… Tamavanti vaarini tinatam apachaaram nannu kshaminchandi. Induku praayaschittangaa neti nundi nenu naramaamsa bhakshana vadilestunnaanu” antoo eto vellipoyaadu.
”Raajaa! Vinnaavugaa ee katha indulo paropakaaranto praanaalanu panangaa petti aa yuvakudini kaapaadina aa saadhuvu goppavaada… Tana praanaalu raakshasudikichchi saadhuvunu kaapaadalanukunna aa yuvakudu goppavaada…? Evaru uttamulu” antoo vikramaarkudini prasninchaadu betaaludu.
”Sarvamu tyaagamu chesinavaade sanyaasi avutaadu. Atadiki dehamupai, praanamupai mamakaaramulundavu. Aa rendu itarulaku upayogapadetlu viniyoginchatam goppa vishayamkaadu. Vayasu undi aihika sukhaala meeda mamakaaranchaavani aa yuvakudu saadhuvunu rakshinchataaniki aatmaarpanaku siddhapaddaadu. Adrshtam koddi praanaalu dakkinchukune avakaasam dakkinaa tirigi praanaalu pogottukovataanike siddha padina aa yuvakude goppavaadu” antoo samaadhaanamivvatanto vikramaarkudiki maunabhangamai betaaludu maayamaipoyi tirigi chettunu aasrayinchaadu.
Share your Thoughts as Comments on Rakshasudu Sanyasi Yuvakudu Katha.