Pranam Tisina Goppa Telugu Moral Stories in Telugu.
అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!
ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను ‘నేనే గొప్ప’ అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు ‘నేనే గొప్ప’ అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ!
ఇలా అన్ని పురుగులూ ఏవేవో గొప్పలు చెప్పుకొంటుంటే, ఓ మిణుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి వూరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి! నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను. అంతే కాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా వుంటాను. “ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలూ” అనుకొంటారు అందరూ! నన్ను చూసి, ఎంత అందంగా వుందో అని అందరూ ముచ్చటపడతారు.అంటూ గిర్రున తిరిగి మిలమిల మెరిసి పోయింది.
మిణుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెర పోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి వూరుకొన్నాయి. మిణుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ వుంటే, బంగారు పిచ్చుక చూసి, రివ్వున చక్కా వచ్చి, ఆ మిణుగురు పురుగును ముక్కుతో కరచుకొని, చెట్టుమీద ఓ కొమ్మకు కట్టుకొని ఉన్న తన గూటిలోని మట్టి ముద్దకు అంటించి, నొక్కేసింది. కాళ్ళు రెక్కలు మట్టిముద్దకు అంటుకు పోవడం వల్ల, మిణుగురు పురుగు కదలలేక పోయినది. ఎగరలేక పోయినది.
ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి. అంతలో చీకురు పురుగు “చూశారా? నక్షత్రంలా మిలమిల మెరిసే శక్తి నాకేవుంది” అంటూ గర్వంగా ఎగిరెగిరిపడిన మిణుగురు పురుగు గతి ఏమైందో! దానిని చూసి మనం బుద్దితెచ్చుకోవాలి. నేనే గొప్ప, నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి” అనుకొంటూ, అటూ ఇటూ వెళ్ళిపోయాయి.
Pranam Tisina Goppa Telugu Moral Stories in English.
Adi oka pedda chettu. Daani modalu daggara konni rakaala rekkala purugulu chaeri, kaburlaadu komtunnaayi. Aa kaburlu perigi perigi, chivariki manalo evarugoppa? Anae vivaadaaniki vachchimdi!
Aa purugulalo oka rekkala cheema gabagabaa mumduku vachchi choodamdi! Naenu naelameeda paakagalanu, gaalilo egaragalanu ‘naenae goppa’ amtoo atoo itoo tirigimdi characharaa! Adi choosi oka cheekuru purugu tana pedda rekkalanu aadistoo choodamdi naa rekkalu emta peddavo, meelo imtamta pedda rekkalu evarikee laevu ‘naenae goppa’ amdi garvamgaa, tana rekkalanu choosukomtoo, choopistoonoo!
Ilaa anni puruguloo aevaevo goppalu cheppukomtumtae, O minuguru purugu characharaa mumduku vachchi voorukomdi, laeniponi goppalu cheppukokamdi nannu choodamdi! Naenu naela meeda paakagalanu, gaalilo egaragalanu. Amtae kaadu meelo evarikee laeni goppadanamu naakunnadi. Naenu milamilaa merisaanamtae nakshatramgaa vumtaanu. “aakaasam numdi O taara digi vachchimdi kaaboloo” anukomtaaru amdaroo! Nannu choosi, emta amdamgaa vumdo ani amdaroo muchchatapadataaru.amtoo girruna tirigi milamila merisi poyimdi.
Minuguru purugu merupulu choosi choosi migilina rekkala purugulu nivvera poyaayi. Aemee maatlaadalaeka kallappagimchi voorukonnaayi. Minuguru purugu vayyaaramgaa gaalilo egurutoo merustoo vumtae, bamgaaru pichchuka choosi, rivvuna chakkaa vachchi, aa minuguru purugunu mukkuto karachukoni, chettumeeda O kommaku kattukoni unna tana gootiloni matti muddaku amtimchi, nokkaesimdi. Kaallu rekkalu mattimuddaku amtuku povadam valla, minuguru purugu kadalalaeka poyinadi. Egaralaeka poyinadi.
Idi choosi rekkala purugulannee hadalipoyaayi. Amtalo cheekuru purugu “choosaaraa? Nakshatramlaa milamila merisae Sakti naakaevumdi” amtoo garvamgaa egiregiripadina minuguru purugu gati aemaimdo! Daanini choosi manam budditechchukovaali. Naenae goppa, naenae goppa ani virraveegakumdaa naduchukovaali” anukomtoo, atoo itoo vellipoyaayi.
Share your Thoughts as Comments on Pranam Tisina Goppa.