You are currently viewing లెక్క తప్పింది | Paramanandayya Sishyula Kathalu – 1

లెక్క తప్పింది | Paramanandayya Sishyula Kathalu – 1

Paramanandayya Sishyula Kathalu is a collection of moral stories in Telugu language. The stories revolve around the life of Paramanandayya, a wise and kind teacher, and his students.

Paramanandayya Sishyula Kathalu in Telugu.

పరమానందయ్యగారికి పన్నెండు మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెలకోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రాయాణంలో వాళ్ళు ఒక వాగును దాట వలసి వచ్చింది.

“అమ్మో! వాగులో మునిగి పోతామేమో” అంటూ భయపడ్డారు. “మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం” అన్నాడు ఒకడు. “సరే” అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి “అందరం వాగుదాటామా?” అనే అనుమానం వచ్చింది. “ఓరేయ్! మీరంతా వరుసలో నిలబడండి. నేను లెక్కపెడతాను” అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు.

“ఒకటి, రెండు, మూడు….. పడకొండు. ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం! ఒకడు వాగులో మునిగిపోయాడు” అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది.

“మనలో ఒకరు వాగులో మునిగిపోయారు” అంటూ అందరూ భోరుభోరున ఏడుస్తూ, గురువు గారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరున విలపించారు.

గురువుగారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్కపెట్టమన్నారు. ఒకడు లెక్కబెట్టాడు. మళ్ళీ పదకొండే వచ్చింది. గురువుగారు శిష్యులూ చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు.

పిల్లలూ ఇప్పుడు మీరు చెప్పండి అసలు లెక్క ఎక్కడ తప్పింది.

Paramanandayya Sishyula Kathalu Main

Paramanandayya Sishyula Kathalu in English.

Paramaanamdayyagaariki pannemdu mamdi Sishyulu. Vaallu okaroju kattelakosam adaviki vellaaru. Tirugu praayaanamlo vaallu oka vaagunu daata valasi vachchimdi.

“Ammo! Vaagulo munigi potaamaemo” amtoo bhayapaddaaru. “manam okari chaeyi okaram pattukoni vaagu daatudaam” annaadu okadu. “sarae” annaadu marokadu. Alaagae vaaru vaagunu daataaru. Sishyullo okariki “amdaram vaagudaataamaa?” anae anumaanam vachchimdi. “Oraey! Meeramtaa varusalo nilabadamdi. Naenu lekkapedataanu” annaadu. Amdaroo varusalo nilabaddaaru.

“Okati, remdu, moodu….. Padakomdu. Oraey padakomdu mamdimae unnaam! Okadu vaagulo munigipoyaadu” annaadu. Sishyulamdaroo okari taruvaata okaru lekkabettaaru. Ennisaarlu lekkabettinaa samkhya padakomdae vachchimdi.

“Manalo okaru vaagulo munigipoyaaru” amtoo amdaroo bhorubhoruna aedustoo, guruvu gaari daggaraku vellaaru. Jarigina vishayam cheppi mallee bhoruna vilapimchaaru.

Guruvugaaru amdarinee taeripaara choosaaru. Sishyulanu mallee lekkapettamannaaru. Okadu lekkabettaadu. Mallee padakomdae vachchimdi. Guruvugaaru Sishyuloo chaesina tappunu gurtimchaaru. Vaaramdarinee varusalo nilabetti svayamgaa lekkabettaaru. Sishyulu tama porapaatu telusukoni navvaaru.

Pillaloo ippudu meeru cheppamdi asalu lekka ekkada tapppindo!

Share your Thoughts as Comments on Paramanandayya Sishyula Kathalu.

Leave a Reply