Paramanandayya Gari Sishyula Katha Vruttantam in Telugu.
పూర్వం దండకారణ్య ప్రాంతంలో శ్వేతవర్ణుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకి గురుభక్తి పరాయణులైన 13 మంది శిష్యులుండేవారు. వాళ్ళు శ్వేతవర్ణుడుకి సకల సేవలు చేస్తూ, గురువుకి ఇష్టులుగా మారారు. వాళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పాడు శ్వేతవర్ణుడు. వాళ్ళెంత జ్ఞానులు అయినా, ఋష్యశృంగుడిలా స్త్రీ, పురుష భేదం తెలియని నిజమైన బ్రహ్మజ్ఞానులు. వాళ్ళు ఒకసారి దండకారణ్య అడవులలో, ఒక పున్నమి రాత్రి, కొన్ని ప్రత్యేక ఆయుర్వేద శాస్త్ర మూలికలు తీసుకు రావటానికి బయలుదేరారు.
ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అరణ్యంలోని కొన్ని మొక్కలు పగలు, కొన్ని రాత్రిళ్ళు మాత్రమే కనిపిస్తాయి. కొన్ని అరుదైన ఔషధ మొక్కలు పున్నమి రాత్రుళ్ళలో మిల, మిల మెరుస్తూ కనిపిస్తాయి. అలా సేకరించిన మొక్కల నుండి ఔషధాలు తయారు చేస్తారు. శ్వేతవర్ణుడి శిష్యులు అలా పవర్ణమి రాత్రి ఔషధ మొక్కలు సేకరిస్తూ, అడవి మధ్య ప్రాంతానికి చేరుకున్నారు.
ఇది ఇలా ఉండగా, శివ వర ప్రసాదంతో పుట్టిన చంద్రలేఖ అనే గంధర్వ రాజకుమార్తె, తన స్నేహితురాళ్ళతో కలిసి, ఆకాశమార్గాన వెళుతూ, దండకారణ్య ప్రాంతానికి వచ్చింది. వారికి ఆ ప్రాంతంలో ఉన్న ఒక సరస్సు వెన్నెలలో ప్రకాశిస్తూ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి, మనసు పులకించిన చంద్రలేఖ ఆ సాగరంలో జలకాలాటలు ఆడాలని నిర్ణయించుకొని, స్నేహితురాళ్ళతో సహా భూమిపై దిగారు. ఆకాశం నుండి భువికి దిగి వచ్చిన ఆ దేవకన్య చంద్రలేఖ, ఆమె స్నేహితురాళ్లు తనువుపై ఉన్న సమస్త వస్త్రాలు విడిచి, గట్టుపై పెట్టి, ఆ సరస్సులోకి దిగి జలకాలాటలు ఆడుకుంటున్నారు.
సరిగ్గా అదే సమయానికి ఔషధ మొక్కలు సేకరిస్తూ, శ్వేతవర్ణుడి శిష్యులు ఒడ్డుదాకా వచ్చారు. అలా వాళ్ళు సరస్సు దగ్గరికి వచ్చిన సమయంలో చంద్రలేఖ స్నానం ముగించి, బట్టలు ధరించటానికి ఒడ్డుకి వచ్చింది. అలా వచ్చిన చంద్రలేఖను, కళ్ళు అప్పగించి, అమాయకంగా చూస్తుండిపోయారు శ్వేతవర్ణుడి శిష్యులు. ఆకస్మికంగా ఎదురయిన ఈ మానవుల్ని చూసి క్షణకాలం దిగ్భ్రాంతికి గురి అయిన చంద్రలేఖ, వెంటనే తేరుకుని, దిగంబరంగా ఉన్న తనని పరిశీలనగా చూస్తున్న ఆ అమాయక శిష్యుల్ని, బుద్ధిహీనులుగా జన్మించి, అజ్ఞానులుగా పేరు పొందమని శపించింది.
ఆమె శపించిన విషయం ఎక్కడో ఆశ్రమంలో ధ్యానంలో ఉన్న శ్వేతవర్ణుడికి తెలిసి తక్షణం చంద్రలేఖ ముందు ప్రత్యక్షమై ఆగ్రహంగా ఆమెతో ఇలా అన్నాడు. “ఓసీ చంద్రలేఖా! నీటికి, పాలకి, స్త్రీకి, పురుషుడికి తేడా తెలియని పసిహృదయం గల నా శిష్యుల్ని అపార్ధం చేసుకొని, బుద్ధిహీనులగా జన్మించమని శాపం ఇచ్చావు. నీవు నా శిష్యుల కిచ్చిన శాపానికి ప్రతీకారంగా, నీవు కూడ అదే మానవుల లోకంలో జీవించి, మానవుడికి భార్యవు కావాలి.”
శ్వేతవర్ణుడి శాపం విన్న చంద్రలేఖ గజ,గజ వణికి, మహర్షిని వేడుకుంది. తప్పు క్షమించి శాపాన్ని ఉపసంహరించమని కోరింది. అప్పుడు ఆ ఋషి శాంతించి, పరమ శివభక్తుడైన చంద్రవర్మని నీవు పెళ్ళాడిన మరుక్షణం నీ శాపం పోతుంది అన్నాడు. అప్పుడు చంద్రలేఖ కూడా, ఋషి శిష్యులకు, తన వివాహం కాగానే శాపవిమోచనం కల్గుతుందని చెప్పి, స్నేహితురాళ్ళతో సహా తన లోకానికి వెళ్ళిపోయింది.
ఆపై శ్వేతవర్ణుడు తన శిష్యులతో ఇలా అన్నాడు. “నాయనలారా! మీకు వచ్చిన ఈ శాపానికి ఏమాత్రం విచారించకండి, మీరు కోనసీమ ప్రాంతంలో ఉన్న పరమానందయ్య అనే ఉత్తముడైన గురువుగారి దగ్గర శిష్యులుగా ఉండండి. సరిగ్గా ఒక సంవత్సరంలోగా, చంద్రలేఖకు, వివాహం జరుగుతుంది. దాంతో మీకు శాపవిమోచనం అయి, మళ్ళీ నా ఆశ్రమానికి రాగలరు.” గురువుగారు, ఇలా మాటలు పూర్తి చేసారో లేదో, ఆ మహర్షి శిష్యుల ఆకార, వికారాలు పూర్తిగా మారిపోయి, వెర్రివాళ్ళ వాలకం పొందారు. మహర్షి వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుండి అదృశ్యం అయ్యాడు.
Paramanandayya Gari Sishyula Katha Vruttantam in English.
Poorvam damdakaaranya praamtamlo svetavarnudu ane maharshi umdevaadu. Aayanaki gurubhakti paraayanulaina 13 mamdi sishyulumdevaaru. Vaallu svetavarnuduki sakala sevalu chestoo, guruvuki ishtulugaa maaraaru. Vaallaki anni rakaala vidyalu nerpaadu svetavarnudu. Vaallemta j~naanulu ayinaa, rshyasrmgudilaa stree, purusha bhedam teliyani nijamaina brahmaj~naanulu. Vaallu okasaari damdakaaranya adavulalo, oka punnami raatri, konni pratyeka aayurveda Saastra moolikalu teesuku raavataaniki bayaluderaaru.
Aayurveda Saastra prakaaram aranyamloni konni mokkalu pagalu, konni raatrillu maatrame kanipistaayi. Konni arudaina aushadha mokkalu punnami raatrullalo mila, mila merustoo kanipistaayi. Alaa sekarimchina mokkala numdi aushadhaalu tayaaru chestaaru. Svetavarnudi Sishyulu alaa pavarnami raatri aushadha mokkalu sekaristoo, adavi madhya praamtaaniki cherukunnaaru.
Idi ilaa umdagaa, Siva vara prasaadamto puttina chamdralekha ane gamdharva raajakumaarte, tana snehituraallato kalisi, aakaasamaargaana velutoo, damdakaaranya praamtaaniki vachchimdi. Vaariki aa praamtamlo unna oka sarassu vennelalo prakaasistoo kanipimchimdi. Aa drsyaanni choosi, manasu pulakimchina chamdralekha aa saagaramlo jalakaalaatalu aadaalani nirnayimchukoni, snehituraallato sahaa bhoomipai digaaru. Aakaasam numdi bhuviki digi vachchina aa devakanya chamdralekha, aame snehituraallu tanuvupai unna samasta vastraalu vidichi, gattupai petti, aa sarassuloki digi jalakaalaatalu aadukumtunnaaru.
Sariggaa ade samayaaniki aushadha mokkalu sekaristoo, svetavarnudi Sishyulu oddudaakaa vachchaaru. Alaa vaallu sarassu daggariki vachchina samayamlo chamdralekha snaanam mugimchi, battalu dharimchataaniki odduki vachchimdi. Alaa vachchina chamdralekhanu, kallu appagimchi, amaayakamgaa choostumdipoyaaru svetavarnudi Sishyulu. Aakasmikamgaa edurayina ee maanavulni choosi kshanakaalam digbhraamtiki guri ayina chamdralekha, vemtane terukuni, digambaramgaa unna tanani pariseelanagaa choostunna aa amaayaka Sishyulni, buddhiheenulugaa janmimchi, ajnaanulugaa peru pomdamani sapimchimdi.
Aame sapimchina vishayam ekkado aasramamlo dhyaanamlo unna svetavarnudiki telisi takshanam chamdralekha mumdu pratyakshamai aagrahamgaa aameto ilaa annaadu. “Osee chamdralekhaa! Neetiki, paalaki, streeki, purushudiki tedaa teliyani pasihrdayam gala naa Sishyulni apaardham chesukoni, buddhiheenulagaa janmimchamani saapam ichchaavu. Neevu naa Sishyula kichchina Saapaaniki prateekaaramgaa, neevu kooda ade maanavula lokamlo jeevimchi, maanavudiki bhaaryavu kaavaali”.
Svetavarnudi saapam vinna chamdralekha gaja,gaja vaniki, maharshini vedukumdi. Tappu kshamimchi Saapaanni upasamharimchamani korimdi. Appudu aa Rshi saamtimchi, parama sivabhaktudaina chamdravarmani neevu pellaadina marukshanam nee saapam potumdi annaadu. Appudu chamdralekha koodaa, Rshi Sishyulaku, tana vivaaham kaagaane saapavimochanam kalgutumdani cheppi, snehituraallato sahaa tana lokaaniki vellipoyimdi.
Aapai svetavarnudu tana sishyulato ilaa annaadu. “naayanalaaraa! Meeku vachchina ee Saapaaniki emaatram vichaarimchakamdi, meeru konaseema praamtamlo unna paramaanamdayya ane uttamudaina guruvugaari daggara Sishyulugaa umdamdi. Sariggaa oka samvatsaramlogaa, chamdralekhaku, vivaaham jarugutumdi. Daamto meeku saapavimochanam ayi, mallee naa aasramaaniki raagalaru.”
Guruvugaaru, ilaa maatalu poorti chesaaro ledo, aa maharshi Sishyula aakaara, vikaaraalu poortigaa maaripoyi, verrivaalla vaalakam pomdaaru. Maharshi vaallani aaseervadimchi akkadi numdi adrsyam ayyaadu.