Padmavathi Devi Anugrham Katha in Telugu.
విక్రమార్కుడు ఆడినమాట కోసం పట్టువిడవక తిరిగి చెట్టుపై నుండి బేతాళుడిని క్రిందకుదించి భుజం మీద వేసుకుని కార్యదీక్షాపరుడై వడి,వడిగా నడకను సాగించాడు.
యథా ప్రకారం భేతాళుడు విక్రమార్కుడికి మౌనభంగం కల్గించే ఉద్దేశంతో ”రాజా! అనితర సాధ్యమైన నీ కార్యదీక్ష చూస్తుంటే నాకు అమితమైన ముచ్చట వేస్తున్నది. ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండటానికి నీకు చక్కని కథను
చెప్తాను విను.”
పూర్వం శ్రీగంధపురం అనే ఊరిలో చక్రధరుడనే యువకుడు ఉండేవాడు. ఒకనాడు అతు పద్మావతి అనే కన్యను చూసి మనసు పడ్డాడు. ఆమె కుటుంబానికి చక్రధరుడి కటుంబానికి దూరపుబంధుత్వం కూడ కలవటంతో అంతా సవ్యంగా జరిగి పద్మావతి చక్రధరుడి భార్య అయ్యింది. చక్రధరుడు ఎంతో ఆనందించి ఆమెతో సుఖంగా జీవిస్తున్నాడు.
ఒకనాడు పద్మావతి సోదరుడు వచ్చి అక్కను, బావను తమింటికి తీసుకురమ్మని తండ్రి పంపిన విషయం తెలియచేసాడు. చక్రధరుడు పద్మావతితో కలసి బావమరిది వెంట అత్తవారింటికి ప్రయాణమయ్యాడు. ఆ గ్రామమునకు
పోయేదారిలో అడవి దారి. ఆ దారిలో పురాతమైన ఒక దేవీ ఆలయం ఉంది. మధ్యాహ్నం వేళకు చక్రధరుడు, పద్మావతి, ఆమె సోదరుడు ఆ ఆలయము సమీపించి చెట్టునీడన విశ్రాంతి తీసుకుని సేద తీరుతున్న సమయంలో హఠాత్తుగా చక్రధరుడు ఆ ఆలయంలోని దేవిని దర్శించుకోవాలన్న తపన కలిగింది. బావమరిదిని, భార్యను అక్కడే వేచి ఉండమని చెప్పి తానొక్కడే ఆలయంలోకి వెళ్ళి దేవీ దర్శనం చేసుకున్నాడు.
అయ్యో! దైవ దర్శనానికి వస్తూ పుష్పం… ఫలం… పత్రం ఏవీ లేకుండ ఒట్టి చేతుల్తొ వచ్చానే అని విచారించి ఆ దేవికి కానుకగా తన శిరస్సును స్వీకరించమని ప్రార్థించి దేవి చేతిలో ఉన్న ఖడ్గంతో తన శిరస్సు ఖండించుకుని మరణించాడు. ఎంతసేపయినా భర్త తిరిగి రాకపోవటంతో పద్మావతి కంగారు పడగా ఆమెను ఊరడించి బావగారిని వెంటతోడ్కుని వస్తానని ఆమె సోదరుడు ఆలయంలోకి ప్రవేశించి శిరస్సు ఖండించుకుని మరణించి ఉన్న చక్రధరుడిని చూసి… అయ్యో! ఎంత విపరీతం జరిగిపోయింది. ఇప్పుడు బావను, చెల్లిని తీసుకువస్తానన్న నా తల్లి, తండ్రులకి ఏం చెప్పాలి? భర్తను క్షేమంగా తెస్తానని మాట ఇచ్చిన నా చెల్లికి మొఖం ఎలా చూపించాలి…? అనుకుని విరక్తి చెంది అదే ఖడ్గంతో తనూ శిరస్సు ఖండించుకుని మరణించాడు.
కొంత సమయం ఎదురు చూసిన పద్మావతి భర్తా, సోదరుడు తిరిగి రాకపోవటంతో వారికి ఏం ఆపద సంభవించిందోనని కంగారు పడుతూ ఆలయంలోకి ప్రవేశించి వారిద్దరి మృతదేహాలను చూసి… అయ్యో! నేనెంత దురదృష్టవంతురాలిని… పాపాత్మురాలిని కాకుంటే ఒకేసారి భర్తను, సోదరుడిని పొగొట్టుకుంటానా అటు అత్తింట… ఇటు పుట్టింట కడుపుకొతను మిగిల్చి నేను బ్రతికుండి ఏ ప్రయోజనం అనుకుని అప్పటికప్పుడు తన ఒంటిపై నున్న చీరతో ఆ దేవి విగ్రహం ముందే ఉరికొయ్యకు వేళ్ళాడుటకు సిద్ధపగా అంతట దేవి ప్రత్యక్షమయ్యి ఆమె ప్రయత్నాన్ని విరమించి వారి శిరస్సులు మొండెంకు అతికించమని, వెంటనే వారు జీవిస్తారని ఉపదేశించి అదృశ్యమయ్యింది. పద్మావతి ఎంతో ఆనందించి వారి శిరస్సులను మొండెంకు అతికించుటలో కొంచెం తొట్రుపాటు చెంది భర్త మొండెంకు సోదరుడి శిరస్సు, సోదరుడి మొండెంకు భర్త శిరస్సును జతచేసింది.
”రాజా! విన్నావుగా ఈ కథ ఇప్పుడు పద్మావతి భర్తగా ఎవరిని స్వీకరించాలి. వారిద్దరిలో ఒకరి శిరస్సు భర్తది కానీ మొండెం సోదరుడిది. మరోకరిది శిరస్సు సోదరుడిది మొండెం భర్తది కదా…” అంటూ బేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నించాడు.
బేతాళా! దేహమునకు ప్రధానము శిరస్సు, శిరస్సు చేతనే మనము ఇతరులను గుర్తిస్తున్నాము. కనుక భర్త శిరస్సు, సోదరుడి మొండెం ఉన్న వానినే పద్మావతి భర్తగా స్వీకరించాలి. అంటూ విక్రమార్కుడు సమాధానమివ్వటంతో అతడికి మౌనభంగమై బేతాళుడు మాయం అయిపోయి తిరిగి చెట్టును ఆశ్రయించాడు.
Padmavathi Devi Anugrham Katha in English. (Vikramarka Bethala Kathalu)
Vikramaarkudu aadinamaata kosam pattuvidavaka tirigi chettupai nundi betaaludini krindakudinchi bhujam meeda vesukuni kaaryadeekshaaparudai vadi,vadigaa nadakanu saaginchaadu.
Yathaa prakaaram bhetaaludu vikramaarkudiki maunabhamgam kalginche uddesanto ”raajaa! Anitara saadhyamaina nee kaaryadeeksha choostunte naaku amitamaina muchchata vestunnadi. Prayaanamlo Srama teliyakundaa undataaniki neeku chakkani kathanu
Cheptaanu vinu.”
Poorvam sreegandhapuram ane oorilo chakradharudane yuvakudu undevaadu. Okanaadu atu padmaavati ane kanyanu choosi manasu paddaadu. Aame kutumbaaniki chakradharudi katumbaaniki doorapubandhutvam kooda kalavatanto antaa savyamgaa jarigi padmaavati chakradharudi bhaarya ayyindi. Chakradharudu ento aanandinchi aameto sukhamgaa jeevistunnaadu.
Okanaadu padmaavati sodarudu vachchi akkanu, baavanu tamintiki teesukurammani tandri pampina vishayam teliyachesaadu. Chakradharudu padmaavatito kalasi baavamaridi venta attavaarintiki prayaanamayyaadu. Aa graamamunaku Poyedaarilo adavi daari. Aa daarilo puraatamaina oka devee aalayam undi. Madhyaahnam velaku chakradharudu, padmaavati, aame sodarudu aa aalayamu sameepinchi chettuneedana visraanti teesukuni seda teerutunna samayamlo hathaattugaa chakradharudu aa aalayamloni devini darsinchukovaalanna tapana kaligindi. Baavamaridini, bhaaryanu akkade vechi undamani cheppi taanokkade aalayamloki velli devee darsanam chesukunnaadu.
Ayyo! Daiva darsanaaniki vastoo pushpam… Phalam… Patram evee lekunda otti chetulto vachchaane ani vichaarinchi aa deviki kaanukagaa tana Sirassunu sveekarinchamani praarthinchi devi chetilo unna khadganto tana Sirassu khandinchukuni maraninchaadu. Entasepayinaa bharta tirigi raakapovatanto padmaavati kamgaaru padagaa aamenu ooradinchi baavagaarini ventatodkuni vastaanani aame sodarudu aalayamloki pravesinchi Sirassu khandinchukuni maraninchi unna chakradharudini choosi… Ayyo! Enta vipareetam jarigipoyindi. Ippudu baavanu, chellini teesukuvastaananna naa talli, tandrulaki em cheppaali? Bhartanu kshemamgaa testaanani maata ichchina naa chelliki mokham elaa choopinchaali…? Anukuni virakti chendi ade khadganto tanoo Sirassu khandinchukuni maraninchaadu.
Konta samayam eduru choosina padmaavati bhartaa, sodarudu tirigi raakapovatanto vaariki em aapada sambhavinchindonani kamgaaru padutoo aalayamloki pravesinchi vaariddari mrtadehaalanu choosi… Ayyo! Nenenta duradrshtavanturaalini… Paapaatmuraalini kaakunte okesaari bhartanu, sodarudini pogottukuntaanaa atu attinta… Itu puttinta kadupukotanu migilchi nenu bratikundi e prayojanam anukuni appatikappudu tana ontipai nunna cheerato aa devi vigraham munde urikoyyaku vellaadutaku siddhapagaa antata devi pratyakshamayyi aame prayatnaanni viraminchi vaari Sirassulu mondemku atikinchamani, ventane vaaru jeevistaarani upadesinchi adrsyamayyindi. Padmaavati ento aanandinchi vaari Sirassulanu mondemku atikinchutalo konchem totrupaatu chendi bharta mondemku sodarudi Sirassu, sodarudi mondemku bharta Sirassunu jatachesindi.
”Raajaa! Vinnaavugaa ee katha ippudu padmaavati bhartagaa evarini sveekarinchaali. Vaariddarilo okari Sirassu bhartadi kaanee mondem sodarudidi. Marokaridi Sirassu sodarudidi mondem bhartadi kadaa…” antoo betaaludu vikramaarkudini prasninchaadu.
Betaalaa! Dehamunaku pradhaanamu Sirassu, Sirassu chetane manamu itarulanu gurtistunnaamu. Kanuka bharta Sirassu, sodarudi mondem unna vaanine padmaavati bhartagaa sveekarinchaali. Antoo vikramaarkudu samaadhaanamivvatanto atadiki maunabhamgamai betaaludu maayam ayipoyi tirigi chettunu aasrayinchaadu.
Share your Thoughts as Comments on Padmavathi Devi Anugrham Katha.