Neti Ginne Katha in Telugu.
పరమానందయ్యగారి దగ్గరకు ఒకసారొక తర్కపండితుడు వచ్చాడు. స్నేహంతో చూడాలని వచ్చిన అతను ఆ మాటలూ, ఈ మాటలూ ఆడాక, తన తర్క శాస్త్రం గురించి ప్రస్తావించాడు. ఇద్దరు స్నేహితులూ తర్కం గురించి మాట్లాడుకోసాగారు. పెద్దవాళ్ళేం మాట్లాడుకుంటున్నా శ్రద్దగా వినమని గురువుగారు చెప్పారుకదా… అందుకని వాళ్ళు (శిష్యులు) ఆ మాటలర్థమయినా కాకపోయినా వినేస్తున్నారు. పండితులిద్దరూ తర్కం, మీమాంస మొదలయిన వాటి గురించి చర్చించుకుంటున్నారు. వాటిల్లో శిష్యులికేవీ అర్థంకావడంలేదు- ఏవో పొడిముక్కలు తప్ప. అయినా వినేస్తున్నారు.
అంతలో గురుతపత్ని శిష్యులని పిలిచి – అతిథి వచ్చారు కదా, ఇంట్లోకి నెయ్యి తెండి అని గిన్నె, డబ్బులు ఇచ్చారు. ఇద్దరు శిష్యులు వెళ్ళబోతుంటే – ఈపాటిదానికిద్దరెందుకూ? అన్నారు గురుపత్ని. ఒక బుర్రకంటే రెండు బుర్రలు నయం అన్నారు గురువుగారు. అన్నాడు ఒకడు. రెండు బుర్రలంటే ఇద్దరుండాలి కదా ? అన్నాడు రెండొవాడు. మీరెందరెళ్ళినా ఒక్క బుర్ర కూడా కాదు – గొణుక్కుందావిడ.
వాళిద్దరూ బజారులకెళ్ళి నెయ్యి గిన్నెలో పోయించుకుని వస్తూంటే – గురువుగారికీ పండితుడుగారికీ జరిగిన మాటలు గుర్తుకొచ్చాయి వీళ్లకి. ఈ నేతికి గిన్నె ఆధారమా ? అడిగాడొకడు. గిన్నెకు నెయ్యే ఆధారము అన్నాడు రెండోవాడు. మహాతెలిసినట్లుగా. అంటే నెయ్యి లేకపోయినా గిన్నె ఉండగలదన్న నా సిద్దాంతాన్ని పూర్వపక్షం చేస్తున్నావన్నమాట. అన్నారు అర్థం తెలియకపోయినా(పడికట్టు) పదం ఉపయోగిస్తూ. ఔనంతే అన్నాడు రెండోవాడు ధీమాగా. ఇద్దరూ కాసేపు వాదించుకుని ఆ పైన కొట్లాట వరకూ వెళ్లిపోయారు.
గిన్నెకి నెయ్యి ఆధారమన్నావుగా… చూడు నీ నేతిగతేమవుతుందో ; అంటూ గిన్నెను బోర్లించేశాడు. గిన్నలో నెయ్యంతా నేలపాలయింది. రెండోవాడికి కోపమొచ్చింది. చటుక్కున మొదటివాడి చేతిలోని గిన్నెను గట్టిగా అతని చేతిమీద కొట్టి ఎగర కొట్టాడు. ఇప్పుడు నీ గిన్నె కాధారమేదీ? నెయ్యుంది కనుక గిన్నె నీ చేతిలో ఉంది. నెయ్యనే ఆధారం పోవడంతో నీ గిన్నె హూష్ – నవ్వాడు రెండోవాడు. బంగారంలాంటి వెండిగిన్నె వాళ్ల తర్కవితర్కాలలో ఎగిరి పంటకాలవలో పడి ప్రవాహం పాలయింది మరి చిక్కకుండా. ఇంటికెళ్లాక – ‘‘ నెయ్యేదీ’’ అని అడిగారు గురుపత్ని జరిగినదంతా చక్కగా చెప్పారిద్దరూ. ఈ జన్మలో మీరు బాగుపడరు అని తలకొట్టుకుందావిడ.
Neti Ginne Katha in English. ( Paramanandayya Sishyula Kathalu )
Paramaanandayyagaari daggaraku okasaaroka tarkapanditudu vachchaadu. Snehanto choodaalani vachchina atanu aa maataloo, ee maataloo aadaaka, tana tarka saastram gurinchi prastaavinchaadu. Iddaru snehituloo tarkam gurinchi maatlaadukosaagaaru. Peddavaallem maatlaadukuntunnaa Sraddagaa vinamani guruvugaaru cheppaarukadaa… Andukani vaallu (Sishyulu) aa maatalarthamayinaa kaakapoyinaa vinestunnaaru. Pandituliddaroo tarkam, meemaamsa modalayina vaati gurinchi charchinchukuntunnaaru. Vaatillo Sishyulikevee arthamkaavadamledu- evo podimukkalu tappa. Ayinaa vinestunnaaru.
Antalo gurutapatni Sishyulani pilichi – atithi vachchaaru kadaa, intloki neyyi tendi ani ginne, Dabbulu ichchaaru. Iddaru Sishyulu vellabotunte – eepaatidaanikiddarendukoo? Annaaru gurupatni. Oka burrakante rendu burralu nayam annaaru guruvugaaru. Annaadu okadu. Rendu burralante iddarundaali kadaa ? Annaadu rendovaadu. Meerendarellinaa okka burra koodaa kaadu – gonukkundaavida.
Vaaliddaroo bajaarulakelli neyyi ginnelo poyinchukuni vastoonte – guruvugaarikee panditudugaarikee jarigina maatalu gurtukochchaayi veellaki. Ee netiki ginne aadhaaramaa ? Adigaadokadu. Ginneku neyye aadhaaramu annaadu rendovaadu. Mahaatelisinatlugaa. Ante neyyi lekapoyinaa ginne undagaladanna naa siddaantaanni poorvapaksham chestunnaavannamaata. Annaaru artham teliyakapoyinaa(padikattu) padam upayogistoo. Aunante annaadu rendovaadu dheemaagaa. Iddaroo kaasepu vaadinchukuni aa paina kotlaata varakoo vellipoyaaru.
Ginneki neyyi aadhaaramannaavugaa… Choodu nee netigatemavutundo ; antoo ginnenu borlinchesaadu. Ginnalo neyyantaa nelapaalayindi. Rendovaadiki kopamochchindi. Chatukkuna modativaadi chetiloni ginnenu gattigaa atani chetimeeda kotti egara kottaadu. Ippudu nee ginne kaadhaaramedee? Neyyundi kanuka ginne nee chetilo undi. Neyyane aadhaaram povadanto nee ginne hoosh^ – navvaadu rendovaadu. Bamgaaramlaanti vendiginne vaalla tarkavitarkaalalo egiri pantakaalavalo padi pravaaham paalayindi mari chikkakundaa. Intikellaaka – ‘‘ neyyedee’’ ani adigaaru gurupatni jariginadantaa chakkagaa cheppaariddaroo. Ee janmalo meeru baagupadaru ani talakottukundaavida.
Share your Thoughts as Comments on Neti Ginne Katha.