Hemalatha Mugguru Yuvakulu Katha in Telugu.
రాజా! నీవు ధైర్యవంతుడివి, సమర్ధుడివి నీవంటి వాడిని మునుపెన్నడూ చూడలేదు. నీకు తప్పక విజయం లభిస్తుంది. ప్రయాణంలో శ్రమతెలియక ఉండటానికి ఒక కథ చెప్తాను విను.
పూర్వం కావేరీ నదీ తీరంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో రామశర్మ అనే ఒక కుటుంబీకుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి హేమలత అనే పుత్రిక ఉన్నది. హేమలత రూపవతి… గుణవతి… నిండు యవ్వనవతి. ఒకనాడు రామశర్మ దగ్గరకు ముగ్గురు యువకులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి హేమలతను తమకిచ్చి వివాహం చెయ్యమని కోరారు. రామశర్మ కాస్తంత ఆలోచించి ఆ యువకులు ముగ్గురికి ఇవ్వను అని చెప్పి పంపేసాడు. ఆ యువకులు మాత్రం ఏ క్షణానయినా రామశర్మ మనసు మార్చుకోవచ్చని భావించి అతడి ఇంటి దగ్గరే చకోరపక్షులవలే సంచరించసాగారు.
కొద్ది మాసాలు గాడిచాయి. ఒకనాడు హేమలత హఠాత్తుగా మరణించింది. ఆమె కుటుంబంతో పాటు ఆ ముగ్గురు యువకులు కూడ ఎంతగానో తల్లడిల్లిపోయారు. స్మశానంలో హేమలత మృత కళేబరానికి అగ్నిసంస్కారం చేసారు. ముగ్గురు యువకుల్లో మొదటివాడు తన నెచ్చలి వియోగం భరించలేక అదే పనిగా దుóఖిస్తూ ఆమె ఆత్మ పుణ్యలోకాలు చేరాలని ప్రార్ధించటానికి తీర్ధయాత్రలకు బయలుదేరాడు.
రెండవవాడు ఆమె అస్థికలు మూట కట్టుకుని కాశీ… ప్రయోగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలోని నదులలో కలపటానికి బయలుదేరి వెళ్ళాడు. మూడవవాడు మాత్రం గుండెలు పగిలేలా ఆమె చితినే కావలిం చుకుని రోదిస్తూ ఉండిపోయాడు. రోజులు భారంగా గుస్తున్నాయి. తీర్ధయాత్రలకు పోయినవాడు కొన్నాళ్ళకు మధ్యాహ్నం వేళ ఓ గ్రామాన్ని చేరాడు. నిద్రహారాల సమయపాలన లేకపోవటం వల్ల వాడి దేహం శుష్కించిపోయి ఉంది. ఆ గ్రామంలో ఓ ఇంటి ముంగిట సేద తీరుతుండగా ఆ ఇంటి ఇల్లాలు అత్ని భోజనానికి రమ్మని పిలిచింది. కాళ్ళు, చేతులు శుభ్రపరుచుకుని మఠం వేసుకుని కూర్చున్నాడు.
ఆ ఇల్లాలు అరిటాకు వేసి ఆహారపదార్ధాలన్ని వడ్డిస్తుండగా మూడేళ్ల వయసున్న ఆమె పుత్రుడు కాళ్ళకూ, చేతులకు అడ్డం పడుతూ ఆమెను చికాకు పరచసాగాడు. ఆ ఇల్లాలు అతడిని మందలిస్తూ రెండు చేతులా ఎత్తి పట్టి మండుతున్న పొయ్యిలోకి విసిరిపారేసింది. క్షణాల్లో అగ్నిదేవుడు ఆ బాలుడి శరీరాన్ని ఆనవాలు లేకుండ స్వాహాచేసాడు.
ఈ దృశ్యం చూస్తూనే కడుపులో తిప్పినట్లు అయ్యి ఆ ఇల్లాలిని చీదరించుకుంటూ ”ఛీ… పాపాత్మురాలా! అడగకుండనే ఆతిథ్యం ఇస్తుంటే నువ్వు మహాఉత్తమురాలివని… కన్నతల్లివంటి దానివని అనుకున్నాను. కానీ కడుపున పుట్టిన బిడ్డనే చేజేతులరా అగ్నికి ఆహుతి చేస్తావా… నీవంటి దాని నుండి నీరైనా ముట్టరాదు. అటువంటిది నేను ఈ పదార్ధములు తినటమా!” అంటూ ఆ యువకుడు ఆ ఇల్లాలిపై మండిపడ్డాడు. ఆ ఇల్లాలు ఏ మాత్రం నొచ్చుకోకుండ ”నాయనా! ఆవేశపడకు నేచేసింది కొత్తవారు ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. నువ్వు ఎంగిలిపడు. నా బిడ్డ నిప్పుల్లోంచి క్షేమంగా నడిచి రావటం నీకు చూపిస్తాను” అంటూ ఎంతో శాంతంగా చెప్పిందామె. ఆమె చెప్పినట్లే ఎంగిలి పడ్డాడు ఆ యువకుడు.
ఆ తర్వాత ఆమె ”మృత సంజీవిని” మంత్రం చదవగానే అగ్నికి ఆహుతి అయిన ఆమె పుత్రుడు క్షేమంగా బ్రతికి బయటకు రావటం చూసి ఆశ్చర్యపోయి ఆ మంత్రంతనకి ఉపదేశించమని ప్రార్ధించాడు. ఆ యువకుడికి మంత్రం ఉపదేశిస్తూ ”నాయనా! నువ్వు ఎవరిని బ్రతికించాలన్నావారి చితాభస్మం ఉండలి” అంటూ మంత్రం ప్రయోగం వివరించింది. ఆ మంత్రం తెలుసుకున్న ఆ యువకుడు వెంటనే హేమలత చితాభస్మం దగ్గరకు బయలుదేరాడు. అతడు అక్కడకు చేరుకునే సరికి అస్థికలు తీసుకుపోయిన రెండవ యువకుడు కూడా తిరిగి వచ్చాడు. మూడవ యువకుడు చితాభస్మాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. మృతసంజీవిని మంత్ర బలం చేత హేమలతను మొదటి యువకుడు తిరిగి బ్రతికించాడు. బ్రతికిన హేమలత ఆ ముగ్గురిని ”మీరెవరు?” అని ప్రశ్నించగా ఆ ముగ్గురు హేమలతకు తన కథ చెప్పారు. ”రాజా! విన్నావుగా ఈ కథ ఇప్పుడు హేమలత తప్పనిసరిగా ఆ ముగ్గురు యువకులలో ఒకరిని పెండ్లాడాలి కదా… మరి ఆ ముగ్గురిలో ఆమె వివాహమాడుటకు తగిన వరుడు ఎవ్వరు…?”
బేతాళా! మొదటి యువకుడు ప్రాణదానం చేసాడు అతడు తండ్రితో సమానమవుతాడు. రెండవవాడు అస్థికలను తీసుకుపోయాడు. అతడు పుత్రుడితో సమానమవుతాడు. మూడవవాడు ఆమె చితాభస్మాన్నే ఆశ్రయంగా చేసుకుని ఆమెనే తలుచుకుంటూ గడిపాడు. కనుక అతడే ఆమెకు తగిన వరుడు.
విక్రమార్కుడికి మౌనభంగం కావటంతో బేతాళుడు మాయం అయ్యి తిరిగి చెట్టును ఆశ్రయించాడు.
Hemalatha Mugguru Yuvakulu Katha in English. ( Vikramarka Bethala Kathalu)
Raajaa! Neevu dhairyavantudivi, samardhudivi neevanti vaadini munupennadoo choodaledu. Neeku tappaka vijayam labhistundi. Prayaanamlo sramateliyaka undataaniki oka katha cheptaanu vinu.
Poorvam kaaveree nadee teeramlo oka braahmana agrahaaram undedi. Andulo raamasarma ane oka kutumbeekudu undevaadu. Aa braahmanudiki hemalata ane putrika unnadi. Hemalataa roopavati… Gunavati… Nindu yavvanavati. Okanaadu raamasarma daggaraku mugguru yuvakulu okari tarvaata okaru vachchi hemalatanu tamakichchi vivaaham cheyyamani koraaru. Raamasarma kaastanta aalochinchi aa yuvakulu mugguriki ivvanu ani cheppi pampesaadu. Aa yuvakulu maatram e kshanaanayinaa raamasarma manasu maarchukovachchani bhaavinchi atadi inti daggare chakorapakshulavale sancharinchasaagaaru.
Koddi maasaalu gaadichaayi. Okanaadu hemalata hathaattugaa maraninchindi. Aame kutumbanto paatu aa mugguru yuvakulu kooda entagaano talladillipoyaaru. Smasaanamlo hemalata mrta kalebaraaniki agnisamskaaram chesaaru. Mugguru yuvakullo modativaadu tana nechchali viyogam bharinchaleka ade panigaa duókhistoo aame aatma punyalokaalu cheraalani praardhinchataaniki teerdhayaatralaku bayaluderaadu.
Rendavavaadu aame asthikalu moota kattukuni kaasee… Prayoga ityaadi punyakshetraalaloni nadulalo kalapataaniki bayaluderi vellaadu. Moodavavaadu maatram gundelu pagilelaa aame chitine kaavalim chukuni rodistoo undipoyaadu. Rojulu bhaaramgaa gustunnaayi. Teerdhayaatralaku poyinavaadu konnaallaku madhyaahnam vela o graamaanni cheraadu. Nidrahaaraala samayapaalana lekapovatam valla vaadi deham sushkinchipoyi undi. Aa graamamlo o inti mumgita seda Teerutundagaa aa inti illaalu atni bhojanaaniki rammani pilichindi. Kaallu, chetulu subhraparuchukuni matham vesukuni koorchunnaadu.
Aa illaalu aritaaku vesi aahaarapadaardhaalanni vaddistundagaa moodella vayasunna aame putrudu kaallakoo, chetulaku addam padutoo aamenu chikaaku parachasaagaadu. Aa illaalu atadini mandalistoo rendu chetulaa etti patti mandutunna poyyiloki visiripaaresindi. Kshanaallo agnidevudu aa baaludi sareeraanni aanavaalu lekunda svaahaachesaadu.
Ee drsyam choostoone kadupulo tippinatlu ayyi aa illaalini cheedarinchukuntoo ”chee… Paapaatmuraalaa! Adagakundane aatithyam istunte nuvvu mahaauttamuraalivani… Kannatallivanti daanivani anukunnaanu. Kaanee kadupuna puttina biddane chejetularaa agniki aahuti chestaavaa… Neevanti daani nundi neerainaa muttaraadu. Atuvantidi nenu ee padaardhamulu tinatamaa!” antoo aa yuvakudu aa illaalipai mandipaddaadu. Aa illaalu e maatram nochchukokunda ”naayanaa! Aavesapadaku nechesindi kottavaaru evaru choosinaa alaage anukuntaaru. Nuvvu emgilipadu. Naa bidda nippullonchi kshemamgaa nadichi raavatam neeku choopistaanu” antoo ento saantamgaa cheppindaame. Aame cheppinatle emgili paddaadu aa yuvakudu.
Aa tarvaata aame ”mrta samjeevini” mantram chadavagaane agniki aahuti ayina aame putrudu kshemamgaa bratiki bayataku raavatam choosi aascharyapoyi aa mantrantanaki upadesinchamani praardhinchaadu. Aa yuvakudiki mantram upadesistoo ”naayanaa! Nuvvu evarini bratikinchaalannaavaari chitaabhasmam undali” antoo mantram prayogam vivarinchindi. Aa mantram telusukunna aa yuvakudu ventane hemalata chitaabhasmam daggaraku bayaluderaadu. Atadu akkadaku cherukune sariki asthikalu teesukupoyina rendava yuvakudu koodaa tirigi vachchaadu. Moodava yuvakudu chitaabhasmaanni antipettukune unnaadu. Mrtasamjeevini mantra balam cheta hemalatanu modati yuvakudu tirigi bratikinchaadu. Bratikina hemalata aa muggurini ”meerevaru?” ani prasninchagaa aa mugguru hemalataku tana katha cheppaaru.
”Raajaa! Vinnaavugaa ee katha ippudu hemalata tappanisarigaa aa mugguru yuvakulalo okarini pendlaadaali kadaa… Mari aa muggurilo aame vivaahamaadutaku tagina varudu evvaru…?”
Betaalaa! Modati yuvakudu praanadaanam chesaadu atadu tandrito samaanamavutaadu. Rendavavaadu asthikalanu teesukupoyaadu. Atadu putrudito samaanamavutaadu. Moodavavaadu aame chitaabhasmaanne aasrayamgaa chesukuni aamene taluchukuntoo gadipaadu. Kanuka atade aameku tagina varudu.
Vikramaarkudiki maunabhamgam kaavatanto betaaludu maayam ayyi tirigi chettunu aasrayinchaadu.
Share your Thoughts as Comments on Hemalatha Mugguru Yuvakulu Katha.