Guddi Gurram Protsaham Katha in Telugu.
ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు, గుట్టల మధ్య దారితప్పి పోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తూ ఒక ఊబిగుంటలోకి చిక్కుకు పోయాడు. అతనికి దెబ్బలేమి తగలకపోయినా, అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్ధిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్లాడు.
“గంగ మీ కారుని ఈ ఊబిలో నుండి బయట పడేయగలడు.” అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తు, “ఈ ముసలి గంగ అంత పని చేయగలదా?” అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు, ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచారు.
రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి “రాధా, రాణీ! రాజా, గంగా! గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞ్తలు చెప్పి, “నువ్వు గంగ అని పిలిచేముందు అన్ని పేర్లెందుకు పిలిచావు?” అని అడిగాడు.
రైతు చిరునవ్వుతో, “ముసలిదైన గంగ ఒక గుడ్డిగుర్రం. దానితో పాటు మరికొన్ని గుర్రాలు కుడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొక్కటే పనిచేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగాచేయలేదు” అని చెప్పాడు.
Guddi Gurram Protsaham Katha in English. ( Neethi Kathalu )
Oka vyakti kaarulo prayaanistoo kondalu, guttala madhya daaritappi poyaadu. Rahadaaripaiki raavaalani prayaanimchi pramaadavasaattoo oka oobiguntaloki chikkuku poyaadu. Ataniki debbalemi tagalakapoyinaa, atani kaaru lotaina buradalo koorukupoyindi. Aa vyakti sahaayam kosam ardhistoo pakkane unna polamloni raitu daggaraku vellaadu.
“Ganga mee kaaruni ee oobilo nundi bayata padeyagaladu.” ani oka musali gurraanni choopistoo cheppaadu raitu. Aa vyakti musali gurram vaipu choosi raituni choostu, “ee musali ganga anta pani cheyagaladaa?” ani adigaadu. Prayatniste poyedi ledu kadaa ani anukunna vyakti sarenantoo raitu, musali gurramlato paatu oobigunta vaipu nadichaaru.
Raitu gurraanni kaaruku taaduto katti “raadhaa, raanee! Raajaa, gangaa! Gurram oke udutuna kaarunu oobiguntalo numchi paiki laagesindi. Aascharyapoyina aa vyakti raituku krtaj~ntalu cheppi, “nuvvu ganga ani pilichemundu anni perlenduku pilichaavu?” ani adigaadu.
Raitu chirunavvuto, “musalidaina ganga oka guddigurram. Daanito paatu marikonni gurraalu kudaa kalisi panichestunnaayante adi aa pani chesenduku jankadu. Adokkate panichestunnaanani anipiste bhayanto aa panini sarigaacheyaledu” ani cheppaadu.