Bavilo Vajralu – Tenali Ramalingadi Kathalu in Telugu.
ఒకనాడు- విజయ నగరంలో ఒక దొంగల ముఠా ప్రవేశించింది. ఆ దొంగలు జట్లుగా విడి పోయి నాలుగు ప్రక్కల సత్రాల్లో బస చేసి పగటి పూట వర్తకుల వేషాల్లో తిరుగుతూ ధనవంతుల ఇళ్ళను కనిపెట్టి రాత్రి పూట దొంగతనాలు చెయ్యసాగారు. ప్రజలందరూ రాయలుకి దొంగల గురించి ఫిర్యాదు చేసారు. రాయలు సైనాధిపతితో చెప్పి రాత్రిపూట మరింత మంది భటులను గస్తీకి పంపమని చెప్పాడు. అలాగే చేసాడు సైన్యాధిపతి. అయినా దొంగతనాలు ఆగలేదు. ఇది కాదని రాయలు దొంగలను పట్టుకున్న వారికి పది వేల బంగారు నాణ్యలు బహుమానం ప్రకటించాడు. ప్రజలు బహుమానంకి ఆశపడి తాము కూడ గస్తీ కాయసాగారు. దానితో దొంగల జోరు కాస్తంత తగ్గింది. గానీ ఎవ్వరికి ఒక్క దొంగ కూడ పట్టుబడలేదు.
ఇలా ఉండగా… ఒకనాడు… దొంగలందరూ సమావేశమయ్యారు. ఒక దొంగ వారి నాయకుడితో నాయకా! ఇక మనం ఈ నగరంలో దొంగతనాలు చెయ్యలేం. ఒక ప్రక్క రాజ భటులు, మరో ప్రక్క ప్రజలు గస్తీ కాస్తున్నారు. ఇంత మంది కళ్ళు కప్పి దొంగతనం చేసి క్షేమంగా తిరిగిరాలేము. అందుకే ఈ నగరాన్ని వదిలి మరో చోటుకి పోదాం” అన్నాడు. ”అదీ నిజమే” అంటూ మిగతా దొంగలు అతనికి వంత పాడరు.
”సరే… ఈ రాత్రి ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేసుకు వచ్చి ఈ చోటు వదిలి పోదాం” అన్నాడు. మిగతా దొంగలందరూ ”ఇటు వంటి సమయంలో మనం దొంగతనానికి వెళ్ళటం ప్రమాదకరం కనుక వద్దు. ” అంటూ అతన్నివారించారు. ఆ నాయకుడు వారి మాటలు వినలేదు. ”మీకు అంతగా భయం అయితే ఇక్కడే ఉండండి. నేనొక్కడినే పోయి ఈ రాత్రికి ఏదో ఒక ఇంటిని దోచుకు వస్తాను” అంటూ రొమ్ము విరుచుకుని మరీ ప్రతిజ్ఞ చేసాడు. అతని ఆవేశం చూసి మరో ముగ్గురు దొంగలకి కూడ ఆవేశం వచ్చింది. వెంటనే… ”నాయకా! మేం నీ వెంట వస్తాం” అన్నారు.
ఆ రాత్రి ఆ నలుగురు దొంగలు దొంగ తనానికి బయలుదేరారు. రాజ వీధిలో భటులను తప్పించుకుని మరో వీధిలోకి అడుగు పెట్టారు ఆ నలుగురు. ఆ వీధిలోనే ఉంది రామలింగడి ఇల్లు – ముందూ, వెనుక పెద్ద పెరుతో ఉండే పాతకాలం నాటి పెంకుటిల్లు అది. రామలింగి ఇంటి సమీపంలోకి వచ్చే సరికి ముందు వైపు నుండి రాజభటులు వెనక వైపు నుండి గస్తీ తిరుగుతున్న పౌరులు వస్తుండటంతో ఆ నలుగురు దొంగలు చప్పున రామలింగడి ఇంటి పెరడులోకి తప్పుకున్నారు.
రామలింగడు అప్పుడే తన కావ్యరచన ముగించి వాటిని వరుసగా పేర్చి ముడులు వేస్తున్నాడు. పెరడిలో శబ్దం అతని చెవులకు చేరింది. నిశ్శబ్దంగా వచ్చి పెరటి వైపు నున్న కిటికిలోంచి చూసాడు. పొదల ప్రక్కన ముడుచుకు కూర్చున్న దొంగల ఆకారాలు రామలింగడి కంట పడ్డాయి. అప్పటికప్పుడు అరచి చుట్టు ప్రక్కల వారిని హెచ్చరించి ఆ దొంగలను పట్టుకుందామనుకున్నాడు. కానీ తను అరిస్తే దొంగలను హెచ్చరించి నట్లువుతుంది వెంటనే అక్కడ్నుంచి జారుకుంటారు. వెంటనే… రామలింగడికి ఒక కొంటె ఆలోచన కలిగింది. చప్పున వచ్చి భార్యను నిద్దుర లేపి దొంగల విషయం చెప్పి ఆమె ఏం చెయ్యాలో చెప్పాడు.
రామలింగి భార్య అతనికి తగ్గ ఇల్లాలే – భర్త దొంగలను పట్టుకోవటానికి వేస్తున్న పాచికను తన వంతు సహకారం అందించటానికి సరే నంది. ఇంట్లో ఉన్న కొన్ని గులకరాళ్ళను పోగేసి ఒక మూటగా కట్టారు. ఆ తర్వాత పెరటి తలుపు తెరిచాడు. అతని వెనుకే వచ్చింది అతని భార్య. అయ్యో! అర్ధ రాత్రి సమయంలో ఎక్కడకండీ… చేతిలో ఆ మూట ఏమిటి? ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది.
”అబ్బా! పెద్దగా అరవకు… చెట్లకు చెవులుంటాయి. తర్వాత చెప్తాను లెద్దూ” అంటూ ఆమెను సమాధాన పరచబోయాడు రామలింగు. ”తర్వాత చెప్తారా? అంటే పెళ్ళినాడు ధర్మార్ధకామ మోక్షములందు సగభాగం పంచుతానని మీరు చేసిన ప్రమాణం వట్టిదేనా…” అంటూ అతి మీద గయ్యిమంటున్నట్లు నటించిందామె. అయ్యో…. అంత మాటనకు. ఈ రహస్యం అందరికి తెలియటం మంచిది కాదు పైగా నగరంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. అందుకని నీకు చెప్పటానికి సంశయిస్తున్నాను – భార్యకు చెప్పటానికి కూడ సంశయమా? ఆ మూటలో మణులున్నాయా…? మాణిక్యాలున్నాయా? వాటిని తీసుకుపోయి మరీ గోతి తీసి పాతిపెడుతున్నారా? బావిలో పారేస్తున్నారా?
”కాస్తంత ఆలస్యం అయినా సరిగ్గా గ్రహించావు. ఈ మూటలో విలువైన వజ్రాలు ఉన్నాయి. వీటిని మన బావిలో పారేస్తున్నా నగరంలో దొంగల బెడద తగ్గినాక తీసుకుందాం” అంటూ దొంగలకు విన్పించేట్లు కాస్తంత పెద్దగా చెప్పాడు రామలింగు. ”బావుంది మీ తెలివి… అయినా ఈ విషయం దొంగలకు తెలిస్తే ఎంచక్కా పెరడులోంచే బావిలోకి దిగి వజ్రాల మూటను తీసుకుపోతారు. ఇంట్లోకి కూడా రావల్సిన అవసరం వారికుండదు పాపం”. ”వారికెలా తెలుస్తుంది. నువ్విలా అరుస్తుంటేనే తెలుస్తుంది. అడిగింది. విన్నది చాలు. నువ్విక ఇంట్లోకి వెళ్ళు. నేను త్వరగా ఈ మూటను బావిలో పేసి వస్తాను” అంటూ భార్యను కసురు కున్నట్లు నటించి ఆమెను ఇంట్లోకి పంపి తాను గబ, గబా వెళ్ళి చేతిలో ఉన్న మూటను పెద్ద శబ్దం వచ్చెలా బావిలో పడవేసి ఇంట్లో కొచ్చి తలుపు మూసాడు రామలింగు.
ఈ దృశ్యం అంతా దొంగలు చూస్తూనే ఉన్నారు. తర్వాత- ఒక దొంగ నాయకుడితో ”నాయకా! వీడెవడో వెర్రిబాగుల వాడివలే ఉన్నాడు. విలువైన వజ్రాల మూటను నీళ్ళపాలు చేసి పోయాడు” అన్నాడు. ”వాడు వెర్రివాడు కాడు… తెలివైనవాడు… మహా గడుసువాడు బావిలో పారేస్తేనేం… అది వాడి పెరటి భావే కదా…కావల్సివచ్చి నప్పుడు దిగి తీసుకుంటాడు. ”వాడి తెలివి ముందు మన తెలివి ఏపాటిది మనం ఏ ఇంటికి దొంగతనానికి వెళ్ళినా ఆ ఇంట్లో ఇనప్పెట్టెలు, భోషాణాలు మాత్రమే వెతుకుతాం గానీ బావుల్లోనూ, పెరటిలోనూ వెతకం కదా. అందుకనే విలువైన వజ్రాలు బావిలో దాచాడు. ఎలాగైనా మనం ఈ వజ్రాలను చేజిక్కించుకుపోవాలి” అంటూ మిగిలిన దొంగల్తో చెప్పాడా నాయకుడు.
సరేనంటే సరేననుకున్నారు. కానీ పాపం ఆ దొంగల్లో ఒక్కరికీ ఈతరాదు- నీళ్ళల్లో దిగకపోతే వజ్రాల మూట దొరకదు. వాళ్ళల్లో ఒకడు తెలివైనవాడున్నాడు అతడు మిగిలిన వాళ్ళతో ”మనం వంతులు వేసుకుని బావిలో నీటిని తోడేద్దాం. ఆ తర్వాత ఒకరం బావిలోకి దిగి మూటను పైకితెద్దాం” అంటూ చెప్పాడు. నలుగురూ సరేనను కున్నారు. ఒకరి తర్వాత ఒకరు నీరు తోడసాగారు. ఈ తంతంతా రామలింగు కిటికిలోనుంచి చూస్తూనే ఉన్నాడు. కొంతసేపు గడిచాక భార్యకు జాగ్రత్తలు చెప్పి ముందు వైపు తలుపు తీసుకుని వెళ్ళి రాత్రి పూట గస్తీ కాస్తున్న రాజ భటులను కలుసుకుని దొంగల సంగతి చెప్పాడు. నాలుగు ప్రక్కల నుండి భటులు కమ్ముకుని గలను బంధించారు.
రామలింగు భటులతో ”అయ్యా! ఈ దొంగలని మరికొంత సేపు నీళ్ళను తోడనియ్యండి. మా పెరటి తోట సగమే తిసింది. మిగిలిన సగం కూడ తడిపితే వారికి ఇవ్వవలసిన కూలీ ఇచ్చేస్తాను” అన్నాడు. చుట్టు ప్రక్కల వారందరూ ఘోల్లున నవ్వారు. పాపం! దొంగలు బిక్కచచ్చిపోయారు. ”అయ్యా! ఈ దొంగలు బావిలో వజ్రాల కోసం నీళ్ళను తోడరు. కానీ ఇంత బుర్ర తక్కువ వెధవలు ఇన్నాళ్ళు మీకు పట్టుబడకుండ దొంగతనాలను చెయ్యటం ఆశ్చర్యంగా ఉంది. ”నిజంగా వజ్రాల మూటను చూస్తూ చూస్తూ ఎవ్వడన్నా బావిలో
పారవేస్తా?” అంటూ దొంగల్ని ప్రశ్నించాడు.
తమని పట్టించటానికే రామలింగు ఆ ఎత్తు వేసాడని అర్థమైన నలుగురు దొంగలు ఉస్సూరుమన్నారు. రాజభటులు ఆ దొంగలను విచారించి నాలుగు వైపుల సత్రాలలో బస చేసి ఉన్న మిగతా దొంగల్ని కూడ బంధించారు. మొత్తం ఆ దొంగల ముఠా నలభై మంది. రాయలు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క దొంగకు పదివేల వరహాల చొప్పున నాలుగు లక్షల వరహాలు బహుమానంగా రామలింగడికి ఇచ్చాడు.
Bavilo Vajralu – Tenali Ramalingadi Kathalu in English.
Okanaadu- vijaya nagaramlo oka dongala muthaa pravesinchindi. Aa dongalu jatlugaa vidi poyi naalugu prakkala satraallo basa chesi pagati poota vartakula veshaallo tirugutoo dhanavantula illanu kanipetti raatri poota dongatanaalu cheyyasaagaaru. Prajalandaroo raayaluki dongala gurinchi phiryaadu chesaaru. Raayalu sainaadhipatito cheppi raatripoota marinta mandi bhatulanu gasteeki pampamani cheppaadu. Alaage chesaadu sainyaadhipati. Ayinaa dongatanaalu aagaledu. Idi kaadani raayalu dongalanu pattukunna vaariki padi vela bangaaru naanyalu bahumaanam prakatinchaadu. Prajalu bahumaanamki aasapadi taamu kooda gastee kaayasaagaaru. Daanito dongala joru kaastanta taggindi. Gaanee evvariki okka donga kooda pattubadaledu.
Ilaa undagaa… Okanaadu… Dongalandaroo samaavesamayyaaru. Oka donga vaari naayakudito naayakaa! Ika manam ee nagaramlo dongatanaalu cheyyalem. Oka prakka raaja bhatulu, maro prakka prajalu gastee kaastunnaaru. Inta mandi kallu kappi dongatanam chesi kshemangaa tirigiraalemu. Anduke ee nagaraanni vadili maro chotuki podaam” annaadu. ”Adee nijame” antoo migataa dongalu ataniki vanta paadaru.
”Sare… Ee raatri edo oka intlo dongatanam chesuku vachchi ee chotu vadili podaam” annaadu. Migataa dongalandaroo ”itu vanti samayamlo manam dongatanaaniki vellatam pramaadakaram kanuka vaddu. ” antoo atannivaarinchaaru. Aa naayakudu vaari maatalu vinaledu. ”Meeku antagaa bhayam ayite ikkade undandi. Nenokkadine poyi ee raatriki edo oka intini dochuku vastaanu” antoo rommu viruchukuni maree pratijna chesaadu. Atani aavesam choosi maro mugguru dongalaki kooda aavesam vachchindi. Ventane… ”Naayakaa! Mem nee venta vastaam” annaaru.
Aa raatri aa naluguru dongalu donga tanaaniki bayaluderaaru. Raaja veedhilo bhatulanu tappinchukuni maro veedhiloki adugu pettaaru aa naluguru. Aa veedhilone undi raamalingadi illu – mundoo, venuka pedda peruto unde paatakaalam naati pemkutillu adi. Raamalingi inti sameepamloki vachche sariki mundu vaipu nundi raajabhatulu venaka vaipu nundi gastee tirugutunna paurulu vastundatanto aa naluguru dongalu chappuna raamalingadi inti peraduloki tappukunnaaru.
Raamalingadu appude tana kaavyarachana muginchi vaatini varusagaa perchi mudulu vestunnaadu. Peradilo sabdam atani chevulaku cherindi. Nissabdangaa vachchi perati vaipu nunna kitikilonchi choosaadu. Podala prakkana muduchuku koorchunna dongala aakaaraalu raamalingadi kanta paddaayi. Appatikappudu arachi chuttu prakkala vaarini hechcharinchi aa dongalanu pattukundaamanukunnaadu. Kaanee tanu ariste dongalanu hechcharinchi natluvutundi ventane akkadnunchi jaarukuntaaru. Ventane… Raamalingadiki oka konte aalochana kaligindi. Chappuna vachchi bhaaryanu niddura lepi dongala vishayam cheppi aame em cheyyaalo cheppaadu.
Raamalingi bhaarya ataniki tagga illaale – bharta dongalanu pattukovataaniki vestunna paachikanu tana vantu sahakaaram andinchataaniki sare nandi. Intlo unna konni gulakaraallanu pogesi oka mootagaa kattaaru. Aa tarvaata perati talupu terichaadu. Atani venuke vachchindi atani bhaarya. Ayyo! Ardha raatri samayamlo ekkadakandee… Chetilo aa moota emiti? Emee teliyanatlu amaayakangaa adigindi.
”Abbaa! Peddagaa aravaku… Chetlaku chevuluntaayi. Tarvaata cheptaanu leddoo” antoo aamenu samaadhaana parachaboyaadu raamalingu. ”Tarvaata cheptaaraa? Ante pellinaadu dharmaardhakaama mokshamulandu sagabhaagam panchutaanani meeru chesina pramaanam vattidenaa…” antoo ati meeda gayyimantunnatlu natinchindaame. Ayyo…. Anta maatanaku. Ee rahasyam andariki teliyatam manchidi kaadu paigaa nagaramlo dongala bedada ekkuvagaa undi. Andukani neeku cheppataaniki samsayistunnaanu – bhaaryaku cheppataaniki kooda samsayamaa? Aa mootalo manulunnaayaa…? Maanikyaalunnaayaa? Vaatini teesukupoyi maree goti teesi paatipedutunnaaraa? Baavilo paarestunnaaraa?
”Kaastanta aalasyam ayinaa sariggaa grahinchaavu. Ee mootalo viluvaina vajraalu unnaayi. Veetini mana baavilo paarestunnaa nagaramlo dongala bedada tagginaaka teesukundaam” antoo dongalaku vinpinchetlu kaastanta peddagaa cheppaadu raamalingu. ”Baavundi mee telivi… Ayinaa ee vishayam dongalaku teliste enchakkaa peradulonche baaviloki digi vajraala mootanu teesukupotaaru. Intloki koodaa raavalsina avasaram vaarikundadu paapam”. ”Vaarikelaa telustundi. Nuvvilaa arustuntene telustundi. Adigindi. Vinnadi chaalu. Nuvvika intloki vellu. Nenu tvaragaa ee mootanu baavilo pesi vastaanu” antoo bhaaryanu kasuru kunnatlu natinchi aamenu intloki pampi taanu gaba, gabaa velli chetilo unna mootanu pedda sabdam vachchelaa baavilo padavesi intlo kochchi talupu moosaadu raamalingu.
Ee drsyam antaa dongalu choostoone unnaaru. Tarvaata- oka donga naayakudito ”naayakaa! Veedevado verribaagula vaadivale unnaadu. Viluvaina vajraala mootanu neellapaalu chesi poyaadu” annaadu. ”Vaadu verrivaadu kaadu… Telivainavaadu… Mahaa gadusuvaadu baavilo paarestenem… Adi vaadi perati bhaave kadaa…kaavalsivachchi nappudu digi teesukuntaadu. ”Vaadi telivi mundu mana telivi epaatidi manam e intiki dongatanaaniki vellinaa aa intlo inappettelu, bhoshaanaalu maatrame vetukutaam gaanee baavullonoo, peratilonoo vetakam kadaa. Andukane viluvaina vajraalu baavilo daachaadu. Elaagainaa manam ee vajraalanu chejikkinchukupovaali” antoo migilina dongalto cheppaadaa naayakudu.
Sarenante sarenanukunnaaru. Kaanee paapam aa dongallo okkarikee eetaraadu- neellallo digakapote vajraala moota dorakadu. Vaallallo okadu telivainavaadunnaadu atadu migilina vaallato ”manam vantulu vesukuni baavilo neetini todeddaam. Aa tarvaata okaram baaviloki digi mootanu paikiteddaam” antoo cheppaadu. Naluguroo sarenanu kunnaaru. Okari tarvaata okaru neeru todasaagaaru. Ee tantantaa raamalingu kitikilonunchi choostoone unnaadu. Kontasepu gadichaaka bhaaryaku jaagrattalu cheppi mundu vaipu talupu teesukuni velli raatri poota gastee kaastunna raaja bhatulanu kalusukuni dongala sangati cheppaadu. Naalugu prakkala nundi bhatulu kammukuni galanu bandhinchaaru.
Raamalingu bhatulato ”ayyaa! Ee dongalani marikonta sepu neellanu todaniyyandi. Maa perati tota sagame tisindi. Migilina sagam kooda tadipite vaariki ivvavalasina koolee ichchestaanu” annaadu. Chuttu prakkala vaarandaroo gholluna navvaaru. Paapam! Dongalu bikkachachchipoyaaru. ”Ayyaa! Ee dongalu baavilo vajraala kosam neellanu todaru. Kaanee inta burra takkuva vedhavalu innaallu meeku pattubadakunda dongatanaalanu cheyyatam aascharyangaa undi. ”Nijangaa vajraala mootanu choostoo choostoo evvadannaa baavilo
Paaravestaa?” antoo dongalni prasninchaadu.
Tamani pattinchataanike raamalingu aa ettu vesaadani arthamaina naluguru dongalu ussoorumannaaru. Raajabhatulu aa dongalanu vichaarinchi naalugu vaipula satraalalo basa chesi unna migataa dongalni kooda bandhinchaaru. Mottam aa dongala muthaa nalabhai mandi. Raayalu prakatinchinatlugaane okkokka dongaku padivela varahaala choppuna naalugu lakshala varahaalu bahumaanangaa raamalingadiki ichchaadu.
Share your Thoughts as Comments on Bavilo Vajralu – Tenali Ramalingadi Kathalu .