Baludu Dongatanamu Telugu Neethi katha.
ఒక గ్రామములో తల్లీ కొడుకు ఉండే వారు. ఆ కొడుకు చిన్నతనములో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికి ఇచ్చెను. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మానాయనె! అని మెచ్చుకొన్నది. అది ఏదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలాబాగున్నదని తలచి ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటిలో నుంచి వస్తువులు తీసుకురావడము మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూలులో, తనతోటి పిల్లల దగ్గర పెన్ను గానీ, పెన్సిల్ గానీ, పుస్తకం గానీ, దొంగతనముగా తీసుకురావడము మొదలు పెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడైయ్యేటప్పటికి గజదొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒక రోజు రక్షక భటులు ఇతన్ని పట్టుకొనిపోవుచూండగా అతని తల్లి “అయ్యో! తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేక పొయానే! చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాక పోవును కదా” అని దుఖించింది. కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు.
Baludu Dongatanamu Telugu Neethi Katha in English.
Oka talli koduku undevaaru. Aa koduku chinnatanamulo okanaadu pakkavaarimtilo numchi totakoora domgilimchi teesukochchi talliki ichchenu. Daaniki aame aapyaayamgaa kaugilimchukoni maanaayane! Ani mechchukonnadi. Adi aedo ghanakaaryamu annatlugaa aa pillavaadu chaalaabaagunnadani talachi iruguporugu vaalla imtilo numchi vastuvulu teesukuraavadamu modalupettaadu. Talli tappani koodaa mamdalimchalaedu. Adae avakaasamgaa teesukoni rojoo skoolulo, tanatoti pillala daggara pennu gaanee, pensil gaanee, pustakam gaanee, domgatanamugaa teesukuraavadamu modalu pettaadu. Kramamgaa perigi peddavaadaiyyaetappatiki gajadomgagaa maari anaeka vyasanaalaku alavaatu paddaadu. Oka roju rakshaka bhatulu itanni pattukonipovuchoomdagaa atani talli “ayyo! Totakoora naadae idi tappani cheppalaeka poyaanae! Cheppinatlayitae tana koduku ilaamti vaadu kaaka povunu kadaa” ani dukhimchimdi. Kaavuna eppudoo domgatanamu chaeyaraadu.
Share your Thoughts as Comments on Baludu Dongatanamu .